TS High Court Jobs 2023: తెలంగాణ జిల్లా కోర్టుల్లో 2,054 పోస్టుల భర్తీకి 8 నోటిఫికేసన్లు జారీ చేసిన హైకోర్టు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లా కోర్టుల్లో.. 2,054 జడ్జీలు, స్టెనోలు, ఎగ్జామినర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి రాష్ట్ర హైకోర్టు వరుసగా..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లా కోర్టుల్లో.. 2,054 జడ్జీలు, స్టెనోలు, ఎగ్జామినర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి రాష్ట్ర హైకోర్టు వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. వీటిల్లో 150 జడ్జీ పోస్టులు, 1,904 ఇతర పోస్టులున్నాయి. ఈ పోస్టులన్నింటికీ కలిపి దాదాపు 8 నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. జడ్జి పోస్టులకు జూన్‌లో రాత పరీక్ష, సెప్టెంబరులో ఇంటర్వ్యూలు నిర్వహించి ఫలితాలను సెప్టెంబరులోనే ప్రకటించనున్నట్లు వెల్లడించింది. అక్టోబరు 31 నుంచి కొత్త జడ్జీలు విధుల్లో చేరేలా ప్రణాళికను రూపొందించింది.
జిల్లా కోర్టుల్లో ఉన్న 1904 జ్యుడిషియల్, మినిస్టీరియల్ సబార్డినేట్ సర్వీసు పోస్టులను ఆయా జిల్లా జడ్జీలు భర్తీ చేస్తారని హైకోర్టు పేర్కొంది. జూనియర్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎగ్జామినర్లు, రికార్డ్ అసిస్టెంట్లు, ప్రాసెస్ సర్వర్లు, ఆఫీస్ సబార్డినేట్ల పోస్టులకు మార్చిలోగా నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిపింది. 33 జిల్లాల్లోని కోర్టులతోపాటు నగరంలోని సిటీ సివిల్ కోర్టు తదితరాల్లో ఉన్న ఖాళీలను విడివిడిగా గుర్తించింది. వీటితోపాటు స్టెనోగ్రాఫర్లు, టైపిస్టులు, కాపీయిస్ట్‌ల పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.