AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: ట్రిమ్ షేవ్‌లో కనిపిస్తున్న రాహుల్ గాంధీ.. ఆగండాగండీ! ఈ ఫొటోలోని వ్యక్తెవ్వరో తెలుసుకోండి..

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఎముకలు కొరికే చలిలో రాహుల్‌ గాంధీ ఎలా కేవలం టీ షర్టుతో రోడ్లపై తిరుగుతున్నాడో..

Rahul Gandhi: ట్రిమ్ షేవ్‌లో కనిపిస్తున్న రాహుల్ గాంధీ.. ఆగండాగండీ! ఈ ఫొటోలోని వ్యక్తెవ్వరో తెలుసుకోండి..
This Man Looks Like Rahul Gandhi
Srilakshmi C
|

Updated on: Jan 05, 2023 | 5:58 PM

Share

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఎముకలు కొరికే చలిలో రాహుల్‌ గాంధీ ఎలా కేవలం టీ షర్టుతో రోడ్లపై తిరుగుతున్నాడో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంతకంటే ఆశ్చర్యపోయే విషయం ఏమంటే బుధవారం (జనవరి 4)నాడు ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో జరిగిన భారత్ జోడో యాత్రలో అచ్చం రాహుల్‌ గాంధీ రూపురేఖలతో ఉన్న మరో వ్యక్తి అక్కడ ప్రత్యక్ష మయ్యాడు. పైగా రాహుల్‌ గాంధీ మాదిరి ప్లెయిన్‌ టీ షర్ట్‌ ధరించి ఆ యాత్రలో పాల్గొన్నాడు. దీంతో అందరి దృష్టి అతనిపైనే నిలిచింది.

మీడియా అతనిపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఇంతకీ అతని పేరు చెప్పలేదు కదూ.. ఫైసల్‌ చౌదరి. డూప్లికేట్‌ రాహుల్‌తో అందరూ సెల్ఫీలు దిగడం, వీడియోలు తీసుకోవడంతో రాహుల్‌ గాంధీ జోడో యాత్రలో ఫైసల్‌ చౌదరి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నలిచాడు. అన్నట్టూ.. ఫైసల్‌ చౌదరి కూడా కాంగ్రెస్‌ కార్యకర్తే. అతను మీరట్‌ కాంగ్రెస్‌ కమిటీలో యాక్టివ్‌ వర్కర్‌ కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.