TSPSC Group 1 Results: రెండు రోజుల్లోనే తెలంగాణ టీఎస్పీయస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెల్లడి..

తెలంగాణ పబ్లిక్‌ సర్విస్‌ కమీషన్‌ (టీఎస్పీయస్సీ) గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ఈ వారంలోనే విడుదలకానున్నాయి. నాలుగైదు రోజుల్లో ఫలితాలు ప్రకటించనుంది. ఫలితాలతోపాటు..

TSPSC Group 1 Results: రెండు రోజుల్లోనే తెలంగాణ టీఎస్పీయస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెల్లడి..
TSPSC Group 1 Results
Follow us

|

Updated on: Jan 05, 2023 | 8:31 PM

తెలంగాణ పబ్లిక్‌ సర్విస్‌ కమీషన్‌ (టీఎస్పీయస్సీ) గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ఈ వారంలోనే విడుదలకానున్నాయి. నాలుగైదు రోజుల్లో ఫలితాలు ప్రకటించనుంది. ఫలితాలతోపాటు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలను కూడా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష తేదీని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్‌ చివరి వారంలో మెయిన్స్‌ నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఓఎంఆర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తయింది. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను 1:50 నిష్పత్తిలో ప్రకటించనుంది. ఈ లెక్కన మెయిన్స్‌కు 25,150 మందిని మాత్రమే ఎంపిక చేయనున్నారు. ఈ వారంలోనే శుక్రవారం లేదా శనివారం వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ వీలుకాకపోతే సోమవారం ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.

కాగా మొత్తం 503 గ్రూప్‌1 పోస్టుల భర్తీకి అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 2,85,916 మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరయ్యారు. నవంబరు 15న ఫైనల్‌ ఆన్సర్‌ ‘కీ’ విడుదల చేసింది. ఈ క్రమంలో 5 ప్రశ్నలను తొలగించింది. మొత్తం 150 మార్కుల్లో 5 ప్రశ్నలను తొలగిస్తే 145 ప్రశ్నలకు వచ్చిన మార్కులను 150 మార్కులకు దామాషా పద్ధతిలో లెక్కించింది. ఫలితాల్లో పాయింట్‌ తర్వాత వచ్చే మూడో డెసిమల్‌ పాయింట్‌ వరకు పరిగణనలోకి తీసుకొని తుది మెరిట్‌ జాబితాను కమిషన్‌ రూపొందిస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.