SSC CHSL 2023: ఇంటర్‌ అర్హతతో కేంద్ర కొలువులకు నోటిఫికేషన్‌.. నేటి నుంచి ప్రారంభమైన ఆన్‌లైన్‌ దరఖాస్తులు

ఇంటర్‌ పాసై ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ కొలువులు సొంతం చేసుకునే అవకాశం. న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ 2023-24 సంవత్సారినికిగానూ.. 'కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2023' (సీహెచ్‌ఎస్‌ఎల్‌) నోటిఫికేషన్‌ను విడుదల..

SSC CHSL 2023: ఇంటర్‌ అర్హతతో కేంద్ర కొలువులకు నోటిఫికేషన్‌.. నేటి నుంచి ప్రారంభమైన ఆన్‌లైన్‌ దరఖాస్తులు
Staff Selection Commission
Follow us
Srilakshmi C

|

Updated on: May 10, 2023 | 3:29 PM

ఇంటర్‌ పాసై ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ కొలువులు సొంతం చేసుకునే అవకాశం. న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ 2023-24 సంవత్సారినికిగానూ.. ‘కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2023’ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో 1600 పోస్టులను భర్తీ చేయనున్నారు. లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ (గ్రేడ్‌-ఎ) విభాగాల్లో ఈ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) 2023 సంవత్సర ప్రకటన విడుదల చేసింది.

ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత పొందినవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్‌ స్కూల్‌ ద్వారా చదివినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్‌లో సైన్స్‌ గ్రూప్‌తో తప్పనిసరిగా మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. దరఖాస్తు దారుల వయసు ఆగస్టు 1. 2023 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే ఆగస్టు 2,1996 నుంచి ఆగస్టు 1, 2005 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్‌లో జూన్‌ 8, 2023వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.100 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు. ఆన్‌లైన్‌లో నిర్వహించే టైర్‌-1, టైర్‌-2 పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైతే రూ.19,900ల నుంచి రూ.92,300ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 8, 2023
  • ఆఫ్‌లైన్ ద్వారా చలానా చెల్లింపులకు చివరి తేదీ: జూన్‌ 12, 2023
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: జూన్‌ 11, 2023
  • అప్లికేషన్‌ సవరణ తేదీలు: జూన్‌ 14 నుంచి జనవరి 15 వరకు, 2023
  • టైర్‌-1 రాత పరీక్ష తేదీ: ఆగస్టులో 2023
  • టైర్‌-2 డిస్క్రిప్టివ్‌ పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.