AP DEECET 2023 Notification: ఆంధ్రప్రదేశ్ డీఈఈసెట్-2023 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నిర్వహించే డీఈఈసెట్-2023 నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ మంగళవారం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నిర్వహించే డీఈఈసెట్-2023 నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ మంగళవారం (మే 9) విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 11 నుంచి ప్రారంభమై 28 వరకు కొనసాగుతుంది. జూన్ 5న హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జూన్ 12, 13 తేదీల్లో డీసెట్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఫలితాలు, ర్యాంకులు జూన్ 19న విడుదల చేస్తారు. మొదటి కౌన్సెలింగ్‌కు వెబ్ ఐచ్ఛికాలను 22 నుంచి 27 వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. సీట్ల కేటాయింపు, ప్రొవిజనల్ లేఖలను 28 నుంచి 30 వరకు జారీ చేస్తారు. డైట్‌ల్లో ధ్రువపత్రాల పరిశీలన జూన్ 31 నుంచి జులై 6 వరకు కొనసాగుతుంది. ఇతర వివరాలు నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.