RCIL Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో ఉద్యోగాలు.. అర్హత.. ఇతర వివరాలు..!
RCIL Recruitment 2022: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అనేక రకాల ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఆయా రంగాలలో ఖాళీగా ఉన్న..
RCIL Recruitment 2022: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అనేక రకాల ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఆయా రంగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాయి. ఇక రైల్వే (Railway)లో అయితే ఇప్పటికే ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్స్ (Job Notification) జారీ అయ్యాయి. నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. ఇక తాజాగా కూడా రైల్వే నుంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. రైల్వేలో వసతులను కల్పించే రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (RCIL) వివిధ కేటగిరిల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గలవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చే నెల 23 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా 69 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో టెక్నికల్, మార్కెటింగ్, ఫైనాన్స్, లీగల్ డిపార్ట్‌మెంట్లలో మేనేజర్, డిప్యూటీ మేనేజర్ (Deputy Manager), సీనియర్ మేనేజర్ ( Senior Manager) వంటి పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నది.
మొత్తం ఖాళీలు: 69: ఇందులో డిప్యూటీ మేనేజర్ 52, మేనేజర్ 10, సీనియర్ మేనేజర్ 7 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో బీఎస్సీగానీ ఇంజినీరింగ్ గానీ చేసి ఉండాలి. అలాగేఎంబీఏ, మార్కెటింగ్, టెలికమ్, ఐటీలో పీజీ డిప్లొమా, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎల్ఎల్‌బీ చేసి ఉండాలి. అభ్యర్థులు 21 నుంచి 34 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి. ఇలాంటి అర్హతలుంటే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఎంపిక: ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు రూ.1200, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600 ఉంటుంది. దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 23 వెబ్‌సైట్: https://railtel.cbtexam.in/
ఇవి కూడా చదవండి: