Northern Railway Jobs: నార్తర్న్ రైల్వే సెంట్రల్ హాస్పిటల్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు.. నెలకు రూ. 2 లక్షలకుపైగా జీతం..
Northern Railway Jobs: నార్తర్న్ రైల్వేకి చెందిన నార్తర్న్ రైల్వే సెంట్రల్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ కార్యాలయం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేసన్ జారీ చేసింది. న్యూఢిల్లీ ప్రధానం కేంద్రంగా ఉన్న నార్తర్న్ రైల్వేకి చెందిన ఈ సంస్థలో...
Northern Railway Jobs: నార్తర్న్ రైల్వేకి చెందిన నార్తర్న్ రైల్వే సెంట్రల్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ కార్యాలయం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేసన్ జారీ చేసింది. న్యూఢిల్లీ ప్రధానం కేంద్రంగా ఉన్న నార్తర్న్ రైల్వేకి చెందిన ఈ సంస్థలో సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 29 సీనియ్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* అనెస్తీషియా, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఆంకాలజీ, డెంటల్, క్యాజువాలిటీ, పాథాలజీ, పీడియాట్రిక్స్, రేడియాలజీ స్పెషలైజేషన్ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణత.
* అభ్యర్థుల వయసు 37 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను వాక్ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 04,04 తేదీల్లో ఆడిటోరియం, నార్తర్న్ రైల్వే సెంట్రల్ హాస్పిటల్, బసంత్ లేన్, న్యూదిల్లీ – 110055 హాజరుకావాలి.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 67,700 నుంచి రూ. 2,08,700 వరకు చెల్లిస్తారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: BPCL Recruitment: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
Booster Dose – Covid 19: బూస్టర్‌తో కరోనా వస్తుందా?.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన వైద్యులు..