AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakisthan: పాకిస్తాన్ లో తెల్లారిపోతున్న చదువులు.. 90 శాతం మంది విద్యార్ధులకు ఏ సబ్జెక్ట్ లోనూ కనీస పరిజ్ఞానం లేదు..

Pakisthan: దాయాది దేశం పాకిస్తాన్(Pakisthan)లో విద్యాప్రమాణ.. విద్యార్ధుల తెలివితేటలు చదువు విషయంపై షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దేశంలోని ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల ..

Pakisthan: పాకిస్తాన్ లో తెల్లారిపోతున్న చదువులు.. 90 శాతం మంది విద్యార్ధులకు ఏ సబ్జెక్ట్ లోనూ కనీస పరిజ్ఞానం లేదు..
Pakisthan Education
Surya Kala
|

Updated on: Jan 22, 2022 | 9:40 AM

Share

Pakisthan: దాయాది దేశం పాకిస్తాన్(Pakisthan)లో విద్యాప్రమాణ.. విద్యార్ధుల తెలివితేటలు చదువు విషయంపై షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దేశంలోని ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్యార్ధుల్లో 90 శాతం కంటే ఎక్కువ మంది చదువులో చలా వెనుకబడి ఉన్నారు. ముఖ్యంగా మేథ్స్, సైన్స్‌పై కనీస .. ఈ విషయాలు ఓ యూనివర్శిటీ దేశవ్యాప్తంగా చేసిన అధ్యయనంలో తెలుగులోకి వచ్చినట్లు మీడియా కథనం. వార్తాపత్రిక ‘ది న్యూస్ ఇంటర్నేషనల్’ లో ప్రచురించిన కథనం ప్రకారం అగాఖాన్ విశ్వవిద్యాలయానికి (Aga Khan University) చెందిన ‘ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ పాకిస్థాన్’ (IED) ఈ అధ్యయనం చేసింది . ఈ అధ్యయనంలో పాకిస్థాన్‌లో విద్యార్థులు ఇంగ్లీషు విషయంలోనే కాదు గణితం ,సైన్స్‌లో కూడా దారుణంగా వెనుకబడి ఉన్నారని తేలింది.

IED చేసిన ఈ అధ్యయనంలో 50 మంది విద్యార్థులలో ఒకరికి మాత్రమే పదాలలో వ్రాసిన సంఖ్యలను సంఖ్యా రూపాల్లోకి మార్చగల ప్రాథమిక సామర్ధ్యం ఉందని తెలిసింది. ఈ అధ్యయనంలో భాగంగా, దేశవ్యాప్తంగా 153 ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలల్లో V, VI నుంచి VIII తరగతులకు చెందిన 15,000 మంది విద్యార్థులు గణితం మరియు సైన్స్‌లో ప్రామాణిక పరీక్షలకు హాజరయ్యారు. ఈ అధ్యయనానికి నిధులు ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ పాకిస్థాన్’కి పాకిస్థాన్ ఉన్నత విద్యా కమిషన్ అందించింది. ఈ పరీక్షలో పాకిస్తాన్ విద్యావ్యవస్థ ఎంత దారుణమైన స్థితిలో ఉందో తెలిసింది.

ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల చదువు: అధ్యయనం ప్రకారం.. గణితంలో విద్యార్థుల సగటు మార్కులు 100కి 27 కాగా సైన్స్‌లో సగటు స్కోరు 100కి 34మాత్రమే.. ఇక ఒక శాతం మంది విద్యార్థులు మాత్రమే ఏదైనా సబ్జెక్టులో 80 కంటే ఎక్కువ మార్కులను స్కోర్ చేశారు. ఇక ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్ధులు సగటు స్కోర్ ఎక్కువగా ఉందని .. అయితే ఏ సబ్జెక్టులోనూ 40కి మించలేదని అధ్యయనం పేర్కొంది. దేశంలోని అన్ని ప్రాంతాల కంటే చదువులో పంజాబ్‌లో మొదటి ప్లేస్ లో ఉందని.. అయినప్పటికీ అక్కడ కూడా ఏ సబ్జెక్టులోనూ 40మార్కులకు కి మించలేదు. ఈ అధ్యయనంలో మొత్తం 78 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, 75 ప్రైవేట్ పాఠశాలలు పాల్గొన్నాయి.

సైన్స్ -మ్యాథ్స్‌పై దృష్టి పెట్టాలి:

తల్లిదండ్రులతమ పిల్లలు చడువుపై ముఖ్యంగా సైన్స్, గణిత విద్యపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని అసిస్టెంట్ ప్రొఫెసర్ నుస్రత్ ఫాతిమా రిజ్వీ అన్నారు. ప్రతి 10 మంది విద్యార్థులలో ఒకరు వ్యాయామం చేసే సమయంలో వేగంగా గుండె కొట్టుకోవడానికి గల కారణాన్ని గుర్తించగలిగామని చెప్పారు. ఇది పాకిస్తాన్‌లో విద్యావ్యవస్థ ఎంత తక్కువ నాణ్యతప్రమాణాలు కలిగి ఉందో సూచిస్తోందని అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 589 మంది ఉపాధ్యాయులు కూడా పాలుపంచుకున్నారు.

Also Read: ఘనంగా మొదలైన త్యాగరాజ 175 వ ఆరాధనోత్సవాలు.. ఒమిక్రాన్ నేపధ్యంలో ఒక్కరోజుకే పరిమితి..