AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tyagaraja Aradhana: ఘనంగా మొదలైన త్యాగరాజ 175 వ ఆరాధనోత్సవాలు.. ఒమిక్రాన్ నేపధ్యంలో ఒక్కరోజుకే పరిమితి..

Tyagaraja Aradhana: ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజు(Tyagaraja)ను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం పుష్య మాసం బహుళ పంచమి రోజున 'త్యాగరాజ స్వామి ఆరాధన' ఉత్సవాలను..

Tyagaraja Aradhana: ఘనంగా మొదలైన త్యాగరాజ 175 వ ఆరాధనోత్సవాలు.. ఒమిక్రాన్ నేపధ్యంలో ఒక్కరోజుకే పరిమితి..
Tyagaraja Aradhana
Surya Kala
|

Updated on: Jan 22, 2022 | 8:52 AM

Share

Tyagaraja Aradhana: ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజు(Tyagaraja)ను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం పుష్య మాసం బహుళ పంచమి రోజున ‘త్యాగరాజ స్వామి ఆరాధన’ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. త్యాగరాజు స్వామి పరమపదించిన రోజైన పుష్య బహుళ పంచమి రోజున ప్రతి ఏడాది ఘనంగా సంగీతోత్సవాలు జరుగుతాయి. అయితే ఈ సంవత్సరం ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ వ్యాప్తి కారణంగా త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఐదు రోజులకు బదులుగా కేవలం ఒక రోజు మాత్రమే నిర్వహించనున్నారు. తమిళనాడు లోని, తంజావూరు జిల్లా, తిరువయ్యూరులోని త్యాగరాజు సమాధి ప్రాంగణంలో ఈ ఉత్సవం జరుగుతుంది.

సంవత్సరానికి ఒకసారి జరిగే సంగీతోత్సవాలు. ఈ ఉత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కర్ణాటక సంగీత విద్వాంసులు త్యాగయ్యకు తమ నివాళులు అర్పించడానికి విచ్చేస్తారు. ఈ ఉత్సవం త్యాగరాజు కావేరీ నది ఒడ్డున సమాధి సమీపంలో జరుగుతుంది. సంగీత విద్వాంసులంతా ఆయన సమాధి చుట్టూ కూర్చుని ఆయన స్వరపరిచిన పంచరత్న కీర్తనలను బృందగానంగా ఆలపిస్తారు.

త్యాగరాజు 1847లో మరణించారు. తాను మరణించడానికి కొన్ని రోజుల ముందు సాంప్రదాయ బద్ధంగా అన్నీ త్యజించి సన్యాసం స్వీకరించారు. త్యాగరాజు మరణించిన తరువాత భౌతిక కాయాన్నిఆయన శిష్యులు కావేరీ నది ఒడ్డున ఖననం చేసి .. ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఆయన వర్ధంతిని ఎవరి ఇళ్ళల్లో వారే జరుపుకునేవారు మొదట్లో.. అలా కొన్ని ఏళ్లకు ఎవరూ పట్టించుకోకపోవడంతో త్యాగరాజు స్మారక చిహ్నం పాడుబదిపోయింది. ఆ సమయంలో త్యాగరాజు వద్ద విద్యనభ్యసించిన ఇద్దరు విద్యార్థులు ప్రముఖ సంగీత విద్వాంసులు ఉమయాల్పురం కృష్ణ భాగవతార్, సుందర భాగవతార్లు తమ గురువు సమాధి దుస్తితిని చూసి వెంటనే పునరుద్ధరణకు ఏర్పాట్లు చేశారు. ప్రతిసంవత్సరం తమ గురువుగారి వర్థంతిని అక్కడే జరపడానికి నిశ్చయించారు. అలా 1905లో త్యాగరాజ అరధనోత్వవాలు మొదలయ్యాయి. ఈ ఉత్సవాలు పేదవాళ్ళకి పెద్దఎత్తున అన్నదానం, వేద సంప్రదాయాల ప్రకారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలు పుష్య బహుళ పంచమి నాడు ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవం లాగా జరుపుకుంటారు. ఆ రోజు సంగీతాన్ని ఆలపించే విద్వాంసులే కాక భారతీయ శాస్త్రీయ సంగీతాభిమానులు ఆ సంగీతాన్ని వినడానికి అక్కడికి వస్తారు

తిరువయ్యార్ వాగ్గేయకార త్రయం నడయాడిన క్షేత్రం. శ్యామ శాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజ స్వాములను ఒకే సమయం లో ఈ గ్రామంలో నివసించారు. అయితే తమిళనాడులో నివసించినా ఈ ముగ్గురు వాగ్గేయకారులూ తెలుగువారు కావడం మన అదృష్టం. అయితే శ్యామ శాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు సంస్కృతం లో కృతిరచన చేయగా.. త్యాగరాజు స్వామి మాత్రం తెలుగులోనే తన రచనలను చేశారు.

రాముని దయతో లోటు లేకుండా నిత్య సంతర్పణలు చేసుకునే త్యాగరాజు వైభవాన్ని చూసి ఈర్ష్యాపరులు ఆయన పూజించే రాములవారి విగ్రహాన్ని కావేరీ నదిలో పారేశారు. అప్పుడు ఆర్తితో త్యాగయ్య పుణ్య క్షేత్రాలు తిరిగి అనేక కీర్తనలు చేశారు. నారదమహర్షి చేసిన ఉపదేశంతో తొంభై ఆరు కోట్ల రామ నామ జపం మొదలు పెట్టారు.. ఈ మహాసాధన చేసే సమయంలో త్యాగరాజుకి కలిగిన దర్శనాలే పంచరత్న కృతులు అని పెద్దలు చెప్తారు. ‘జగదానంద కారకా…’ అంటూ రాముణ్ణి నుతించి,  ‘సాధించెనే ఓ మనసా…, ఎందరో మహానుభావులు.. అంటూ రాముడిని కీర్తించిన త్యాగయ్యని స్మరించుకోవడం ఎంతో గొప్ప పూర్వ పుణ్యం ఉంటే తప్ప సాధ్య పడదని సంగీతకారుల నమ్మకం.

Also Read:

Priyanka Chopra: తల్లైన స్టార్ హీరోయిన్.. సరోగసీ ద్వారా బిడ్డపుట్టినట్లు ప్రకటించిన ప్రియాంక నిక్ దంపతులు