AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: ఈ రాశులలో జన్మించిన వ్యక్తులు ఆర్థికంగా చాలా అదృష్టవంతులు.. ఆ రాశులేంటంటే..!

Astrology: ధనవంతులు కావాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ప్రతీ ఒక్కరు డబ్బు సంపాదించాలని, లగ్జరీ లైఫ్‌ని ఆస్వాధించాలని

Astrology: ఈ రాశులలో జన్మించిన వ్యక్తులు ఆర్థికంగా చాలా అదృష్టవంతులు.. ఆ రాశులేంటంటే..!
Shiva Prajapati
|

Updated on: Jan 22, 2022 | 9:54 AM

Share

Astrology: ధనవంతులు కావాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ప్రతీ ఒక్కరు డబ్బు సంపాదించాలని, లగ్జరీ లైఫ్‌ని ఆస్వాధించాలని భావిస్తుంటారు. అంతెందుకు.. ప్రస్తుత కాలంలో డబ్బే మనిషిని నడిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. డబ్బు ఉంటే ఏ పని అయినా ఇట్టే అయిపోతుంది. డబ్బు ఉంటేనే బంధువులు, స్నేహితులు, బంధాలు ఏర్పడే పరిస్థితి ప్రస్తుత రోజుల్లో ఉంది. అందుకే అందరూ డబ్బు సంపాదించాలని బలంగా కోరుకుంటారు. అయితే, డబ్బు విషయంలో మనిషి పుట్టిన జన్మ నక్షత్రం, రాశి ప్రభావం కూడా ఉంటుందట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పలు రాశి చక్రాల్లో జన్మించిన వ్యక్తులు చాలా అరుదుగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారట. ఎందుకంటే.. లక్ష్మీ దేవి వారి పట్ల కరుణ చూపుతుందట. ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారు ఆర్థిక అదృష్టవంతులు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అంతేకాదు.. వీరు కష్టపడి పని చేయడం, నిజాతీయగా ఉండటం, ఇతరులకు సాయం చేయడం వీరిలోని ప్రత్యేకతలు. మరి ఆ నాలుగు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మేషం : ఈ రాశి వారు కష్టపడి పనిచేస్తారు. ఏ పని తలపెట్టినా.. నిజాయితీగా పనిని పూర్తి చేసేంత వరకు విశ్రమించరు. వీరు చేపట్టిన ప్రతి పనిలో అదృష్టం వరిస్తుంది. ఈ రాశి వారికి ఎప్పుడూ డబ్బు, సంపద కొరత ఉండదు. అవసరమైనప్పుడు ఎక్కడి నుంచొ ఒక చోట నుంచి వారికి డబ్బు అందుతుంది.

కర్కాటకం: ఈ రాశి వారికి అమ్మవారు లక్ష్మీ దేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. కుబేరుడి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. వీరికి అసాధ్యమైనది అంటూ ఏదీ లేదు. చాలా కష్టపడి పని చేస్తారు. ఆచరణాత్మకంగా ఉంటారు. వీరు బహుముఖ ప్రజ్ఞావంతులు. కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టపడుతారు. వీరికి ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు.

మకరం: ఈ రాశి వారు చాలా కష్టపడి పనిచేస్తారు. ఏ పనినైనా పూర్తి నిజాయితీతో పూర్తి చేస్తారు. అనవసరంగా డబ్బు ఖర్చు చేయరు. డబ్బును ఆదా చేసే మంచి అలవాటు ఉంది. డబ్బును ఆదా చేసి ధనవంతులు అవుతారు.

కుంభం: ఈ రాశి వారి చాలా మృదు స్వభావం కలిగి ఉంటారు. వీళ్లలో కరుణ ఎక్కువ. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతారు. వీరు కష్టపడి పని చేస్తారు. జీవితంలో డబ్బును వృధా చేయకుండా ఆదా చేస్తారు.

గమనిక: ఇక్కడ ప్రచురించిన సమాచారం కేవలం మత, ఆచార విశ్వాసాల ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Also read:

Covid 19 Vaccine Latest Updates: అలాంటి వారికి వ్యాక్సీన్ వేయకండి.. రాష్ట్రాలకు కేంద్రం కీలక లేఖ..!

Co-WIN portal: కోవిన్ పోర్టల్ సురక్షితం.. ఎలాంటి డేటా లీక్ కాలేదు.. స్పష్టం చేసిన కేంద్రం

Kangana Ranaut: కంగన రనౌత్ సోషల్ మీడియా పోస్టులపై సుప్రీం కోర్టు సంచలన కామెంట్స్.. పట్టించుకోవడం మానేయాలంటూ..