Chankya Niti: జీవితంలో ఈ 5 విషయాలను అర్థం చేసుకున్న వ్యక్తి ఎలాంటి కష్టాన్నైనా అధిగమిస్తారు..!
Chankya Niti: ఆచార్య చాణక్యుడు చెప్పే మాటల్లోనే జీవిత పరమార్థం దాగి ఉంది. ఆచార్య తన అనుభవాల ద్వారా ఏదైతే..
Chankya Niti: ఆచార్య చాణక్యుడు చెప్పే మాటల్లోనే జీవిత పరమార్థం దాగి ఉంది. ఆచార్య తన అనుభవాల ద్వారా ఏదైతే సాధించారో, దానిని తన గ్రంధాల ద్వారా ప్రజలకు అందించారు. జీవితంలో కష్టనష్టాలను అధిగించడం కోసం ఐదు సూత్రాలను అవగతం చేసుకోవాలని ఆచార్య చాణక్యుడు చెప్పారు. మరి ఆ 5 ప్రత్యేక విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. దేవతలు, సాధువులు, తల్లిదండ్రులు చాలా అరుదుగా సంతోషిస్తారు. కానీ దగ్గరి, దూరపు బంధువులు గౌరవించబడినప్పుడు సంతోషిస్తారు. ఇక పండితులు ఆధ్యాత్మిక సందేశానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆనందాన్ని పొందుతారు. 2. మనిషి చేసే పనులు అతడిని ఎప్పటికీ వదలవని ఆచార్య చెబుతారు. వేల ఆవుల మధ్య ఆవు దూడ తన తల్లిని అనుసరించినట్లు. అలాగే కర్మ కూడా ఆ వ్యక్తిని అనుసరిస్తుంది. కాబట్టి మీ సత్కార్యాలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. 3. నాలుగు వేదాలు, ఇతర అన్ని మత గ్రంధాలు చదివిన వ్యక్తి తన స్వంత ఆత్మను గ్రహించకపోతే.. అతని జ్ఞానం అంతా వ్యర్థమే. అలాంటి వారిని గరిటతో అభివర్ణించారు ఆచార్య చాణక్యుడు. ఎందుకంటే.. గరిటతో రకరకాల వంటలు చేసినా దేనినీ రుచి చూడలేరని భావం. 4. విజయాన్ని రుచి చూడాలనుకుంటే, వైఫల్య భయాన్ని తొలగించడం ముఖ్యం. మీ లక్ష్యాన్ని గమనించండి, మీ విజయ ప్రయాణంలో వైఫల్యాన్ని పాఠంగా తీసుకోవడం అలవర్చుకోండి. ప్రయత్నాలు చేయడం ద్వారా, మీరు మీ లక్ష్యాన్ని సాధించడంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. 5. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ సంతృప్తిగా జీవించడం నేర్చుకోవాలని ఆచార్య చాణక్యుడు పేర్కొన్నారు. ఎందుకంటే అన్ని ఆనందాలను పొందిన వ్యక్తి ఈ లోకంలోనే లేడు. అందరూ దేవుడు నియంత్రణలో ఉన్నారని ఆయన అభిప్రాయం.
Also read:
IPL 2022 Mega Auction: ఐపీఎల్ మెగా వేలానికి దూరం కానున్న స్టార్ ఆటగాళ్లు.. ఎందుకో తెలుసా..
Nagarjuna: సమంత నాగచైతన్యల విడాకులపై మొదటిసారి స్పందించిన నాగార్జున.. ఏమన్నారంటే..