AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

19-Year British Girl: యువతి పార్ట్‌ టైం జాబ్‌.. వార్డ్ రోబ్ లో బట్టలు సర్దుతూ నెలకు 50 వేల సంపాదన..

19-Year-Old British Girl: కొంత మంది చేసే ఉద్యోగాలు విచిత్రంగా ఉంటాయి. కానీ ఆ వృత్తిలో వాళ్లు ఆదాయంతోపాటు తృప్తినీ పొందుతారు. చూసేవాళ్లకు అది ఎంతో ఈజీ పనిలాగా..

19-Year British Girl: యువతి పార్ట్‌ టైం జాబ్‌.. వార్డ్ రోబ్ లో బట్టలు సర్దుతూ నెలకు 50 వేల సంపాదన..
19 Year Old British Girl
Surya Kala
|

Updated on: Jan 22, 2022 | 12:15 PM

Share

19-Year-Old British Girl: కొంత మంది చేసే ఉద్యోగాలు విచిత్రంగా ఉంటాయి. కానీ ఆ వృత్తిలో వాళ్లు ఆదాయంతోపాటు తృప్తినీ పొందుతారు. చూసేవాళ్లకు అది ఎంతో ఈజీ పనిలాగా కనిపిస్తుంది.. కానీ చేసేవాళ్లకే తెలుస్తుంది ఆ వృత్తిలోని సాధకబాధకాలు.. ఇక్కడ ఓ యువతికి అదనపు మనీ అవసరం పడింది. అందుకు తనకు చేతనైన పనినే వృత్తిగా ఎంచుకుంది. రోజుకు 3 నుంచి 9 గంటలు ఆ పని చేస్తూ నెలకు 50 వేలదాకా సంపాదిస్తోంది.. ఇంతకీ ఆమె చేసే పనేంటి అంటారా.. బట్టలు సర్దడం. మీరు విన్నది నిజమే… మన దేశంలో అల్మరాల్లో, బీరువాల్లో, షెల్ఫుల్లో బట్టలు సర్దుకున్నట్లుగా… విదేశాల్లో వార్డ్ రోబ్ లో బట్టలు సర్దుకుంటారు. వాటిని సర్దుకునే టైమ్ లేని వాళ్లు… ఇతరులతో ఆ పని చేయించుకొని… డబ్బు ఇస్తారు. ఆ యువతి ఆ జాబ్ చేస్తోంది.

ఇంగ్లండ్ లోని పురాతన నగరం లైసెస్టర్‌కు చెందిన ఆమె ఓ స్టూడెంట్. ఎక్స్ ట్రా మనీ కోసం ఈ పార్ట్ టైమ్ జాబ్ వెతుక్కుంది. వార్డ్ రోబ్ లో బట్టల్ని పద్దతిగా సర్దడం, కలర్స్ ని బట్టీ సర్దడం, బట్టల రకాలను బట్టీ సర్దడం ఇవన్నీ పనిలో భాగం. సర్దిన తర్వాత వార్డ్ రోబ్ ని ఎవరైనా చూస్తే… వావ్ భలే ఉంది… చాలా అందంగా ఉంది. అద్భుతమైన డెకరేషన్ అని మెచ్చుకోవాలి. అలా సర్దాలి. అదేమంత తేలిక కాదు. అదో రకమైన ఆర్ట్. అందులో ఎల్లా… ప్రొఫెషనలిస్ట్ అయ్యింది. అందుకే ఆమెకు ఇలాంటి ఆఫర్స్ వస్తున్నాయి. ఈ పని కోసం ఎల్లా… గంటకు 1500 నుంచి 2000 దాకా తీసుకుంటోంది. ఫ్యాషన్ అంటే ఇష్టపడే ఎల్లా… మొదట్లో ఫ్రెండ్స్, చుట్టాల వార్డ్ రోబ్స్ ని అందంగా డెకరేట్ చేసింది. క్రమంగా ఆమె చేస్తున్న పనికి గుర్తింపు వచ్చింది. అలా బయటి వాళ్లు కూడా డబ్బులిచ్చి పనిచేయించుకోవడం మొదలుపెట్టారు. ఆమె పని తీరు కస్టమర్లకు బాగా నచ్చుతోంది. ప్రస్తుతం ఆమెకు 20 మంది రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. వారి దగ్గరకు 2 వారాలకు ఓసారి వెళ్తోంది. వాళ్లంతా ఆమెతో పని చేయించుకుంటూ మనీ ఇస్తున్నారు. ఇలా ఎల్లా ప్రస్తుతం నెలకు 50వేల దాకా సంపాదిస్తోంది.

Also  Read:  ఈ ఆహార పదార్ధాలు రెగ్యులర్ గా తీసుకోండి.. వృద్ధాప్య ఛాయలను సహజ పద్ధతుల్లో తగ్గించుకోండి..