Gurukula Notification 2022: గురుకులాల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటీఫికేషన్ విడుదల..?ఎన్ని పోస్ట్‌లంటే..?.!

ఇన్నాళ్లు గిరిజన రిజర్వేషన్లు, ఇతరత్రా అవాంతరాలతో గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాలనోటిఫికేషన్ విడుదలలో జాప్యం జరిగింది.  ప్రభుత్వం అనుమతించిన పోస్టుల భర్తీకీ సంబంధించిన ప్రతిపాదనలను..

Gurukula Notification 2022: గురుకులాల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటీఫికేషన్ విడుదల..?ఎన్ని పోస్ట్‌లంటే..?.!
Gueukula Teachers
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Nov 26, 2022 | 12:14 PM

ఇన్నాళ్లు గిరిజన రిజర్వేషన్లు, ఇతరత్రా అవాంతరాలతో గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాలనోటిఫికేషన్ విడుదలలో జాప్యం జరిగింది.  ప్రభుత్వం అనుమతించిన పోస్టుల భర్తీకీ సంబంధించిన ప్రతిపాదనలను గురుకుల సొసైటీలు తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డుకు సమర్పించాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రతిపాదనల మేరకు పోస్టులవారీగా రిజర్వేషన్లు, రోస్టర్‌ పాయింట్ల వివరాలను పరిశీలించేందుకు నియామకాల బోర్డు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో 9,096 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి ఇప్పటికే రాష్ట్ర ప్రభు త్వం అనుమతించింది. అయితే ఈ బాధ్యతలను ప్రభుత్వం తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డుకు అప్పగించింది.

వారం రోజులలో పరిశీలనలు.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీల పరిధిలోని 9,096 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది.

ఈ క్రమంలో సంస్థల వారీగా పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు రూపొందించి బోర్డుకు సమర్పించాయి. ఈ ప్రతిపాదనలను వారం లోపు పరిశీలించేలా బోర్డు నిర్దేశించుకుంది. గురుకుల సొసైటీలు సమర్పించిన ప్రతిపాదనల్లో పొరపాట్లు, సవరణలుంటే వాటిని పూర్తి చేసేలా అధికారులకు బోర్డు ఆదేశాలు ఇవ్వబోతుంది.

ఇవి కూడా చదవండి

డిసెంబర్‌ నెలలో నోటిఫికేషన్‌.. గురుకుల విద్యాసంస్థల ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రతిపాదనల పరిశీలన పూర్తయిన అనంతరం వారంలోపు పోస్టుల వారీగా నోటిఫికేషన్లు ఇవ్వాలని గురుకుల నియామకాల బోర్డు భావిస్తోంది. ప్రాధాన్యతాక్రమంలో నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ ప్రక్రియను సైతం అదే క్రమంలో పూర్తిచేయాలనే యోచనలో ఆ బోర్డు ఉంది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.