SAIL Recruitment: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలకు పైగా జీతం..

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఒడిశా రాష్ట్రంలోని రర్కెరాలో ఉన్న ఈ ప్రభుత్వ రంగ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

SAIL Recruitment: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలకు పైగా జీతం..
Sail Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 26, 2022 | 3:45 PM

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఒడిశా రాష్ట్రంలోని రుర్కెలో ఉన్న ఈ ప్రభుత్వ రంగ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 17 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో మేనేజర్ (బాయిలర్ ఆపరేషన్) (09), మేనేజర్ (ప్రాజెక్టులు) (04), మేనేజర్ (ఆటోమేషన్) (04) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.

* మేనేజర్‌ – బాయిలర్‌ ఆపరేషన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 14-12-2022 నాటికి 37 ఏళ్లు, మిగిలిన ఖాళీలకు 35 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తులనుడిప్యూటీ జనరల్ మేనేజర్ (పి & జి), బ్లాక్ ఇ, గ్రౌండ్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, రవుర్కెలా స్టీల్ ప్లాంట్, రవుర్కెలా, ఒడిశా అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 80,000 నుంచి రూ. 2,20,000 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 14-12-2022ని నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..