AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET PG-2023యే చివరి పరీక్ష.. ఆ తర్వాత కనుమరుగు..! ఎందుకంటే..

వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ పరీక్ష కనుమరుగుకానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో నిర్వహించే నీటీ పీజీ-2023 (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్) పరీక్షయే చివరి పరీక్ష అవుతుందని ఎన్టీఏ..

NEET PG-2023యే చివరి పరీక్ష.. ఆ తర్వాత కనుమరుగు..! ఎందుకంటే..
NEET PG to soon be replaced with NExT
Srilakshmi C
|

Updated on: Nov 10, 2022 | 7:07 PM

Share

వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ పరీక్ష కనుమరుగుకానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో నిర్వహించే నీటీ పీజీ-2023 (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్) పరీక్షయే చివరి పరీక్ష అవుతుందని ఎన్టీఏ అధికారిక వర్గాలు తెలిపాయి. నీట్‌ పరీక్ష స్థానంలో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రానుంది. దీనిలో అర్హత సాధించిన ఎంబీబీఎస్‌ ఫైనల్ ఇయర్‌ విద్యార్ధులు మత్రమే పీజీ మెడికల్‌ విద్యనభ్యసిస్తారన్నమాట. సోమవారం (న‌వంబ‌రు 7) నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్స్‌ట్‌) 2023 డిసెంబర్‌లో నిర్వహించాలని భావిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) తెలియజేసినట్లు అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి.

ఆ లెక్కన 2019-2020 బ్యాచ్‌కు చెందిన ఎంబీబీఎస్‌ విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. పరీక్ష ఫలితాల అనంతరం నెక్స్ట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించవచ్చని సమావేశంలో చర్చించారు. అంటే 2024-2025 బ్యాచ్ నుంచి పీజీ మెడికల్‌ కోర్సులు ప్రారంభమవుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.