Watch Video: సొంత రాష్ట్రంలో రాష్ట్రపతి ముర్ము పర్యటన.. 2 కిలోమీటర్ల నడకమార్గాన జగన్నాథ స్వామి దర్శనం..
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వరాష్ట్రమైన ఒరిస్సాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం (నవంబర్ 10) భువనేశ్వర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. రాష్ట్రపతి హోదాలో తొలిసారి ఒరిస్సాలో అడుగు పెట్టిన ద్రౌపది ముర్ముకు..
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వరాష్ట్రమైన ఒరిస్సాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం (నవంబర్ 10) భువనేశ్వర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. రాష్ట్రపతి హోదాలో తొలిసారి ఒరిస్సాలో అడుగు పెట్టిన ద్రౌపది ముర్ముకు.. ఆ రాష్ట్ర గవర్నర్ గణేశిలాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఘన స్వాగతం పలికారు. సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్‌లో పూరీలోని జగన్నాథ ఆలయ సందర్శనకు బయలుదేరారు. పూరీకి చేరుకున్న అనంతరం మర్ము గ్రాండ్ రోడ్‌లో తన కాన్వాయ్‌ను ఆపుచేయించి, జగన్నాథ స్వామిని దర్శించుకునేందుకు సామాన్య భక్తురాలిగా 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు. మార్గం మధ్యలో స్థానికులు, పాఠశాల విద్యార్ధులతో ఇంటరాక్ట్ అయ్యారు. గంటపాటు ఆలయ సందర్శన చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాష్ట్రపతి కార్యాలయం తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.
అనంతరం తిరిగి భువనేశ్వర్‌కు తిరిగి వచ్చిన తర్వాత రాష్ట్రపతి గౌరవార్థం రాజ్‌భవన్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని మయూర్‌భంజ్ జిల్లాకు చెందిన ముర్ము రెండవ రోజు (శుక్రవారం) పర్యటనలో భాగంగా ఇతర కార్యక్రమాలకు హాజరుకావడంతోపాటు, ముర్ము చదివిన పాఠశాలను కూడా సందర్శించనున్నారు. కాగా ఈ ఏడాది జూలైలో రాష్ట్రపతి అయిన తర్వాత ముర్ము రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి. ముర్ము పర్యటన నిమిత్తం ఒరిస్సా రాజధానిలోని అన్ని ఆఫీసులు, పాఠశాలలు, కాలేజీలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సగం రోజు సెలవు ప్రకటించింది.
In a rare gesture, President Droupadi Murmu walked about two kilometers to seek the blessings of Lord Jagannath at Puri. Devotees greeted the President on her way to the temple. pic.twitter.com/b6C8IQQZnr
— President of India (@rashtrapatibhvn) November 10, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.