Telangana: ప్రధాని పర్యటనకు నిరసనల సెగ.. మోదీ నో ఎంట్రీ టూ తెలంగాణ అంటూ ఫ్లెక్సీలు..
తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర సర్కారు మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ మరింత ముదురుతోంది. కౌంటర్లు, కామెంట్లకు అంతే దీటుగా స్ట్రాంగ్ కౌంటర్స్ వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో...
తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర సర్కారు మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ మరింత ముదురుతోంది. కౌంటర్లు, కామెంట్లకు అంతే దీటుగా స్ట్రాంగ్ కౌంటర్స్ వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించే సమయంలో ఆయనకు వ్యతిరేకంగా ప్లెక్సీలు, బ్యానర్లు వెలుస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో బైబై మోడీ ఫ్లెక్సీలు రాజకీయ దుమారం రేపింది. ఈ తరుణంలో ప్రధాని మోడీ ఎల్లుండి (శనివారం) రామగుండంలో పర్యటించనున్నారు. ఈ నెల 12 న ఆయన తెలంగాణకు రానున్నారు. రామగుండం లోని ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ను జాతికి అంకితం చేయనున్నారు. ఈ పరిస్థితుల మధ్య ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. చేనేతపై విధించిన జీఎస్టీని వెనక్కి తీసుకున్న తర్వాతే తెలంగాణలో అడుగు పెట్టాలంటూ.. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ పేరుతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ‘మోదీ నో ఎంట్రీ టూ తెలంగాణ’ అంటూ ఫ్లెక్సీలు చెక్‌పోస్ట్‌తో పాటు పలు చోట్ల దర్శనమిస్తున్నాయి.
మరోవైపు కార్మిక సంఘాలు, విద్యార్థి జేఏసీలు చేస్తున్న నిరసనలు, హెచ్చరికలు తెలంగాణలో మరింత కాక రేపుతున్నాయి. ఈ పర్యటన తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారంటూ కార్మికులు ప్రధానిపై మండిపడుతున్నారు. ఆయన పర్యటనను అడ్డుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. రామగుండం, శ్రీరాంపూర్, మందమర్రిలో నిరసనలు చేపట్టారు. అన్ని విశ్వ విద్యాలయాల్లో నల్ల జెండాలతో ఆందోళన చేపట్టాలని విద్యార్థి జేఏసీ నిర్ణయించింది. ప్రశ్నించింది. ఇప్పటికే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభమైందని, ఉత్పత్తి కూడా స్టార్ట్ అయ్యాక ఇప్పుడు దానిని ప్రారంభించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
కాగా.. ఈ నెల 12న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని రామగుండానికి ప్రధాని చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రామగుండం ఎరువులు, రసాయనాల పరిశ్రమ (ఆర్‌ఎ్‌ఫసీఎల్)ను ప్రారంభిస్తారని పీఎంఓ తెలిపింది. ఆ తర్వాత సాయంత్రం 4.15 గంటలకు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం