Telangana: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. డిసెంబర్‌ 1 నుంచి అన్ని వర్సిటీలకు..

తెలంగాణ‌ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో డిసెంబరు 1 నుంచి ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ అమలు చేయాలని సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ కేవలం..

Telangana: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. డిసెంబర్‌ 1 నుంచి అన్ని వర్సిటీలకు..
Biometric Attendance
Follow us

|

Updated on: Nov 10, 2022 | 5:01 PM

తెలంగాణ‌ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో డిసెంబరు 1 నుంచి ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ అమలు చేయాలని సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ కేవలం పీజీ విద్యార్ధులకు మాత్రమే పరిమితంకాగా.. డిగ్రీ స్థాయిలోనూ బయోమెట్రిక్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌ అన్ని యూనివర్సిటీలను ఆదేశించారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండున్నరేళ్లుగా బయోమెట్రిక్‌ హాజరును అన్ని యూనివర్సిటీలు ఎత్తివేసిన సంగతి తెలిసిందే. కరోనా ఉధృతి తగ్గడంతో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కేవలం పీజీ విద్యార్ధులకు మాత్రమే బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ అమలు చేస్తున్నారు.

ఈ విధంగా ప్రతి సెమిస్టర్‌లో విద్యార్థులకు తప్పనిసరిగా 75 శాతం హాజరు లేకపోతే సెమిస్టర్‌ పరీక్షలు రాసేందుకు అర్హత కోల్పోతారు. అలాగే స్కాలర్‌షిప్‌ పొందేందుకు కూడా వీలుండదు. తాజా ఆదేశాల మేరకు బయోమెట్రిక్‌ మిషన్ల ఏర్పాటులో అన్ని వర్సిటీలు నిమగ్నమయ్యాయి. కాగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ అటెండెన్స్‌ తప్పనిసరి చేస్తూ అక్టోబర్‌ 13 విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి ఆధార్‌తో కూడిన బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్ర సర్కార్ అన్ని విద్యా సంస్థలను ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.