TSBIE: నవంబర్‌ 11న భేటీకానున్న తెలంగాణ ఇంటర్‌ బోర్డు..! గుర్తింపు పొందని జూనియర్‌ కాలేజీలకు చెక్‌ పెట్టేనా?

తెలంగాణ‌ రాష్ట్ర ఇంటర్‌ బోర్డు అనుబంధ గుర్తింపు పొందని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలపై వేటుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దాదాపు 200 కాలేజీల అఫిలియేషన్‌ ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి కాకుండా..

TSBIE: నవంబర్‌ 11న భేటీకానున్న తెలంగాణ ఇంటర్‌ బోర్డు..! గుర్తింపు పొందని జూనియర్‌ కాలేజీలకు చెక్‌ పెట్టేనా?
Telangana Inter Board
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 10, 2022 | 6:36 PM

తెలంగాణ‌ రాష్ట్ర ఇంటర్‌ బోర్డు అనుబంధ గుర్తింపు పొందని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలపై వేటుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దాదాపు 200 కాలేజీల అఫిలియేషన్‌ ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి కాకుండా హైదరాబాద్‌లో నగరంలో వివిధ గృహ, వాణిజ్య సముదాయాల్లో మరో 340కి పైగా కాలేజీలు నడుస్తున్నాయి. ఈ కాలేజీలకు ఎన్‌వోసీ (అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రం) రానందున బోర్డు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. గుర్తింపు పొందని ఈ కాలేజీల్లో విద్యనభ్యసించే విద్యార్థులను ఇంటర్‌బోర్డు లెక్కల్లోకి తీసుకోదు. ఆయా కాలేజీలకు మినహాయింపు ఇవ్వదలిస్తే అది నేరుగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఐతే ప్రతీ ఏటా ఇలా అనుమతి ఇవ్వడం మూలంగా సంఖ్యకు మించి జూనియర్‌ కాలేజీలు వెలిసినట్లు, ముగింపు ఎప్పుడని బోర్డు ఇన్‌ఛార్జి సెక్రటరీ నవీన్‌ మిత్తల్‌ భావించారు. నిజానికి విద్యామంత్రి సబిత ఈ కాలేజీలకు అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, నవీన్‌ మిత్తల్‌ అభ్యంతరం తెలుపుతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే గుర్తింపు పొందకుండా నడుపుతున్న కాలేజీల్లో దాదాపు లక్ష మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ విద్యాసంవత్సరానికి సదరు కాలేజీలకు అనుమతి నిరాకరించాలని, వాటిల్లో విద్యనభ్యసిస్తున్న లక్ష మంది విద్యార్థులతో రెగ్యులర్‌గా పరీక్ష రాయించడానికి బదులు.. ప్రైవేట్‌గా (హాజరు మినహాయింపు తీసుకొని నేరుగా పరీక్ష రాసేవిధానం) పరీక్షలు రాయించాలని ఆయన భావిస్తున్నారు. ఈ పద్ధతి కేవలం ఆర్ట్స్‌ గ్రూపులు చదువుతున్న విద్యార్ధులకు మాత్రమే. ఇక సైన్స్‌ గ్రూపుల విద్యార్ధుల సంగతేంటనేది ప్రశ్నార్ధకంగా మారింది. పైగా అఫిలియేషన్‌ లేని కాలేజీల్లో వేలమంది సైన్స్‌ గ్రూపుల్లోనే చదువుతున్నారు. దీనిపై న‌వంబ‌రు 11న ఇంటర్‌బోర్డు పాలక మండలితో చర్చించనుంది. ఐతే సుమారు అయిదేళ్ల తర్వాత (2017) సమావేశంకానున్న ఇంటర్‌బోర్డు పాలకమండలి అయిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 1500 – 2000 అంశాల ఆమోదం కోసం బోర్డు ఎదురుచూస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్