CSL Recruitment 2022: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో 143 అప్రెంటిస్‌ ఖాళీలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..

భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్‌, జలమార్గాల మంత్రిత్వశాఖకు చెందిన కేరళలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌.. 143 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

CSL Recruitment 2022: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో 143 అప్రెంటిస్‌ ఖాళీలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..
Cochin Shipyard Limited Recruitment 2022
Follow us

|

Updated on: Nov 10, 2022 | 7:28 PM

భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్‌, జలమార్గాల మంత్రిత్వశాఖకు చెందిన కేరళలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌.. 143 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, మెకానిక్స్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటర్‌ అప్లికేషన్‌/కంప్యూటర్‌ ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సేఫ్టీ ఇంజనీరింగ్, మెరైన్‌ ఇంజనీరింగ్‌, నావల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ షిప్‌ బిల్డింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ డిగ్రీ, ఇంజనీరింగ్‌/టెక్నాలజీ విభాగంలో డిప్లొమా లేదా తత్సమనా కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నవంబర్‌ 30, 2022వ తేదీ నాటికి దరఖాస్తుదారుల వయసు 18 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా డిసెంబర్‌ 7, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌ లిస్టింగ్‌, సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టులకైతే నెలకు రూ.10,200లు, టెక్నీషియన్ (ఒకేషనల్) అప్రెంటిస్ పోస్టులకు రూ.12,000 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Latest Articles
ఏలకులను వేడి నీటిలో కలుపుకుని తాగితే ఆ సమస్యలన్నీ మటాషే..
ఏలకులను వేడి నీటిలో కలుపుకుని తాగితే ఆ సమస్యలన్నీ మటాషే..
వెండి తెరపైకి సూపర్ స్టార్ జీవిత కథ.. హీరోగా నటించేది అతనేనా..
వెండి తెరపైకి సూపర్ స్టార్ జీవిత కథ.. హీరోగా నటించేది అతనేనా..
శ్రీశైలం డ్యామ్‎ను పరిశీలించిన కేఆర్ఎంబి, ప్రపంచ బ్యాంకు సభ్యులు
శ్రీశైలం డ్యామ్‎ను పరిశీలించిన కేఆర్ఎంబి, ప్రపంచ బ్యాంకు సభ్యులు
అమెజాన్‌లో రూ.30 వేలకే సామ్‌సంగ్ ఎస్ 23 ఫోన్
అమెజాన్‌లో రూ.30 వేలకే సామ్‌సంగ్ ఎస్ 23 ఫోన్
'ఈ సమయంలో బయటకి పోవొద్దు..' ఆరోగ్య శాఖ కీలక సూచన
'ఈ సమయంలో బయటకి పోవొద్దు..' ఆరోగ్య శాఖ కీలక సూచన
సరదాగా డ్యాన్స్ చేసినా.. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?
సరదాగా డ్యాన్స్ చేసినా.. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?
విరాళాలపై ప్రత్యేక పన్ను రాయితీలు..ఆ నిబంధనలు పాటించకపోతే నష్టాలు
విరాళాలపై ప్రత్యేక పన్ను రాయితీలు..ఆ నిబంధనలు పాటించకపోతే నష్టాలు
ఈ గింజలను చిన్నచూపు చూడకండి.. చెంచాడు తింటే అద్భుతమే..
ఈ గింజలను చిన్నచూపు చూడకండి.. చెంచాడు తింటే అద్భుతమే..
సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై కాల్పులు.. నిందితుల్లో ఒకరు జైల్లోనే మృతి !
సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై కాల్పులు.. నిందితుల్లో ఒకరు జైల్లోనే మృతి !
ఏంటీ..!! ఈ క్రేజీ హీరోయిన్ ఆర్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్టా..!
ఏంటీ..!! ఈ క్రేజీ హీరోయిన్ ఆర్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్టా..!