NEET PG 2021: మార్పుల్లేవు.. యథాతథంగా నీట్ పీజీ ప్రవేశ పరీక్ష.. కఠిన మార్గదర్శకాలు విడుదల

NEET PG Exam 2021 దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ తరుణంలో నీట్ పరీక్షను వాయిదా వేయాలని అన్ని చోట్ల నుంచి వ్యతిరేకత

NEET PG 2021: మార్పుల్లేవు.. యథాతథంగా నీట్ పీజీ ప్రవేశ పరీక్ష.. కఠిన మార్గదర్శకాలు విడుదల
Neet
Follow us

|

Updated on: Apr 11, 2021 | 11:51 AM

NEET PG Exam 2021 దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ తరుణంలో నీట్ పరీక్షను వాయిదా వేయాలని అన్ని చోట్ల నుంచి వ్యతిరేకత వినిపిస్తోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాయిదా వేయాలంటూ ఇప్పటికే పలు రాష్ట్రాలు.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. అయితే పరీక్షపై కేంద్రం శనివారం క్లారిటీ ఇచ్చింది. నీట్‌ పీజీ పరీక్ష (NEET PG 2021) ను షెడ్యూల్‌ ప్రకారం యథావిధిగా నిర్వహించనున్నట్లు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ (NBE) ప్రకటించింది. ముందుగా ప్రకటించిన విధంగానే ఈ పరీక్షను ఏప్రిల్‌ 18న నిర్వహిస్తామని.. పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు ఉండదంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్‌బీఈ కొన్ని మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది.

మార్గదర్శకాలు విడుదల..

• దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలను మరింత కఠినం చేస్తూ పలు మార్గదర్శకాలను జారీ చేసింది. • కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే పరీక్ష కేంద్రాలను పెంచినట్లు పేర్కొంది. • దీంతోపాటు విద్యార్థుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా.. సులువుగా ప్రయాణించేలా ఈ పాస్‌లు జారీ చేయనున్నట్లు బోర్డు తెలిపింది. • పరీక్షా కేంద్రాల్లో ప్రవేశానికి వేరు వేరు సమయాలను కేటాయిస్తున్నట్లు పేర్కొంది. ఈ వివరాలు పరీక్ష రాసే అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్‌, మెయిల్‌ ద్వారా పంపనున్నారు. • పరీక్షకు హాజరయ్యేవారు మాస్క్‌ ధరించడం, హాండ్‌ శానిటైజర్‌ ఉపయోగించడం తప్పనిసరని పేర్కొంది. • పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే ముందు శరీర ఉష్ణోగ్రతను పరీక్షిస్తారు. ఒకవేళ వారికి టెంపరేచర్ అధికంగా ఉంటే ప్రత్యేక గదిలో పరీక్ష నిర్వహిస్తారు. • ఈ మేరకు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ రాష్ట్రాలకు కూడా పలు సూచనలు చేసింది. పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.

కాగా.. నీట్ పీజీ పరీక్షను దేశవ్యాప్తంగా 1.75 లక్షల మంది విద్యార్థులు రాయనున్నారు. 18 న మధ్యాహ్నం 2 నుంచి 5.30 గంటల వరకు ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. అయితే ఎన్‌బీఈ (National Board of Examinations) పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను ఆదివారం విడుదల చేయనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ nbe.edu.in ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఎన్‌బీఈ తెలిపింది. కాగా ఈ పరీక్ష ఫలితాలను మే 31న వెల్లడించనున్నారు.

Also Read:

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..