Railway BLW Recruitment: ఇండియన్‌ రైల్వే అప్రెంటిస్‌ పోస్టుల ఫలితాలు వచ్చేశాయ్‌.. ఇలా చెక్‌ చేసుకోండి..

Railway BLW Apprentice Recruitment 2021: బనారస్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌ (బిఎల్‌డబ్ల్యూ), వారణాసి అపెంట్రిస్‌ పోస్టులకు జనవరి 15న నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. 374 ట్రైనీ (అప్రెంటిస్‌) పోస్టులకు భర్తీ చేసిన..

Railway BLW Recruitment: ఇండియన్‌ రైల్వే అప్రెంటిస్‌ పోస్టుల ఫలితాలు వచ్చేశాయ్‌.. ఇలా చెక్‌ చేసుకోండి..
Railway Blw Jobs
Follow us

|

Updated on: Apr 11, 2021 | 11:45 AM

Railway BLW Apprentice Recruitment 2021: బనారస్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌ (బిఎల్‌డబ్ల్యూ), వారణాసి అపెంట్రిస్‌ పోస్టులకు జనవరి 15న నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. 374 ట్రైనీ (అప్రెంటిస్‌) పోస్టులకు భర్తీ చేసిన ఈ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మెరిట్‌ జాబితాను విడుదల చేశారు.

ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

* మెరిట్‌ జాబితాను తెలుసుకోవాలంటే ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ blw.indianrailways.gov.inలోకి వెళ్లాలి. * అనంతరం హోమ్‌ పేజీలో ఉండే ‘కెరీర్‌’ అనే విభాగంలోకి వెళ్లాలి. * తర్వాత కెరీర్‌ విభాగంలో కనిపించే ‘BLW అప్రెంటిస్‌’పై క్లిక్‌ చేయాలి. * మీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. * వెంటనే పీడీఎఫ్‌ ఫైల్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. * జాబితో మీ పేరు ఉందో లేదో సదరు పీడీఎఫ్‌ చూసి చెక్‌ చేసుకోవచ్చు. * ఇలా కాకుండా నేరుగా ఫలితాలు తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్‌ చేయండి.

సర్టిఫికేట్స్‌ వెరిఫికేషన్‌..

మెరిట్‌ జాబితాలో చోటు సంపాదించుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికేట్లను వారణాసిలోని టెక్నికల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రిన్సిపాల్‌లో వెరిఫికేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ తేదీని త్వరలోనే ప్రకటిస్తారు. నిర్ణీత తేదీన ఉదయం 10 గంటలకు అభ్యర్థులు రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఈ నోటిఫికేషన్‌ ద్వారా.. బనారస్ లోకోమోటివ్ వర్క్‌షాప్ (బిఎల్‌డబ్ల్యు) లో పెయింటర్‌, మెషినిస్ట్‌, వెల్డర్, ఫిట్టర్, కార్పెంటర్‌, ఎలక్ట్రీషియన్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Also Read: APCPDCL Job Notification: టెన్త్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..!

నిరుద్యోగులు అలర్ట్..! యూనివర్సిటీ పోస్టులకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల వర్తింపు.. టీఎస్‌పీఎస్‌సీ తాజా నిర్ణయం..

AP Grama Volunteer: కృష్ణా జిలాల్లో గ్రామవాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్.. ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోండి ఇలా