JNTUH: జేఎన్టీయూ హైదరాబాద్ బీటెక్ ఫస్ట్ ఇయర్ అకడమిక్ క్యాలెండర్ 2023 విడుదల.. నవంబర్ 3 నుంచి తరగతులు..
జేఎన్టీయూ హైదరాబాద్ 2022-23 విద్యా సంవత్సరానికిగానూ బీటెక్ అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్, బీఫార్మసీ ఫస్ట్ ఇయర్ తరగతులు..
జేఎన్టీయూ హైదరాబాద్ 2022-23 విద్యా సంవత్సరానికిగానూ బీటెక్ అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్, బీఫార్మసీ ఫస్ట్ ఇయర్ తరగతులు నవంబరు 3 నుంచి ప్రారంభం కానున్నాయి.
సెమిస్టర్-1 టైం టేబుల్
- నవంబరు 3 నుంచి డిసెంబరు 28 వరకు మొదటి సెమిస్టర్ తొలి విడత తరగతులు
- డిసెంబరు 29 నుంచి జనవరి 4 వరకు మొదటి మిడ్‌టర్మ్ పరీక్షలు
- జనవరి 5 నుంచి మార్చి 2 వరకు రెండో విడత తరగతులు
- మార్చి 17 నుంచి సెమిస్టర్ పరీక్షలు
సెమిస్టర్-2 టైం టేబుల్
- రెండో సెమిస్టర్ తరగతులు ఏప్రిల్ 3 నుంచి జూన్ 10 వరకు తరగతులు
- మే 15 నుంచి 27 వరకు వేసవి సెలవులు
- జూన్ 12 నుంచి 17 వరకు మొదటి మిడ్ టర్మ్ పరీక్షలు
- జూన్ 19 నుంచి ఆగస్టు 12 వరకు రెండో విడత తరగతులు
- ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 9 వరకు సెమిస్టర్ పరీక్షలు
ఎంటెక్, ఎం ఫార్మసీ ఫస్ట్ ఇయర్ తరగతులు అక్టోబరు 26 నుంచి ప్రారంభమయ్యాయి. ఇక ఎంబీఏ/ఎంసీఏ తరగతులు నవంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
సెమిస్టర్-1 టైం టేబుల్
- నవంబరు 10 నుంచి జనవరి 4 వరకు మొదటి సెమిస్టర్ తొలి విడత తరగతులు
- జవనరి 5 నుంచి జనవరి 11 వరకు మొదటి మిడ్‌టర్మ్ పరీక్షలు
- జనవరి 12 నుంచి మార్చి 11 వరకు రెండో విడత తరగతులు
- మార్చి 27 నుంచి ఏప్రిల్ 25 వరకు సెమిస్టర్ పరీక్షలు
సెమిస్టర్-2 టైం టేబుల్
- రెండో సెమిస్టర్ తరగతులు ఏప్రిల్ 31 నుంచి జూన్ 21 వరకు తరగతులు
- మే 15 నుంచి 27 వరకు వేసవి సెలవులు
- జూన్ 22 నుంచి 28 వరకు మొదటి మిడ్ టర్మ్ పరీక్షలు
- జూన్ 30 నుంచి ఆగస్టు 24 వరకు రెండో విడత తరగతులు
- ఆగస్టు 25 నుంచి ఆగస్టు 31 వరకు సెమిస్టర్ పరీక్షలు
- సెప్టెంబర్ 1 నుంచి సెప్టెబర్ 8 వరకు ప్రిపరేషన్ సెలవులు, ప్రాక్టికల్ పరీక్షలు
- సెప్టెంబర్ 9 నుంచి సెప్టెబర్ 23 వరకు సెమిస్టర్ పరీక్షలు
పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.