JEE Main 2024 Results: జేఈఈ మెయిన్ సెషన్ 1 ఫైనల్ ఆన్సర్ ‘కీ’ విడుదల.. త్వరలో రిజల్ట్స్
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ 2024 తొలి విడత పరీక్షల తుది ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సోమవారం (ఫిబ్రవరి 12) విడుదల చేసింది. గతంలో ఎన్టీయే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 12వ తేదీన ఫలితాలు విడుదల చేయవల్సి ఉంది. అయితే ఈ రోజు తుది ఆన్సర్ కీ మాత్రమే విడుదల చేసింది. త్వరలో ఫలితాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ 2024 తొలి విడత పరీక్షల తుది ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సోమవారం (ఫిబ్రవరి 12) విడుదల చేసింది. గతంలో ఎన్టీయే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 12వ తేదీన ఫలితాలు విడుదల చేయవల్సి ఉంది. అయితే ఈ రోజు తుది ఆన్సర్ కీ మాత్రమే విడుదల చేసింది. త్వరలో ఫలితాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఫలితాల ప్రకటన అనంతరం అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in. లో ఫలితాలు నేరుగా చెక్ చేసుకోవచ్చు.
కాగా జేఈఈ మెయిన్ పేపర్ 2 పరీక్ష జనవరి 24 నిర్వహించింది. పేపర్ 1 పరీక్షను జనవరి 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో నిర్వహించింది. ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా దాదాపు 12,95,617 మంది విద్యార్ధులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 12,25,529 మంది విద్యార్ధులు హాజరయ్యారు. జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభమైంది. మార్చి 2వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ వరకు రెండో విడత పరీక్షలు జరగనున్నాయి. రెండు విడతల్లో వచ్చిన మార్కుల్లో గరిష్ఠంగా వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
జేఈఈ మెయిన్ సెషన్ 1 ఫైనల్ ఆన్సర్ ‘కీ’ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Telangana: ప్రశాంతంగా ముగిసిన గురుకుల పరీక్ష
కరీంనగర్ జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు ఫిబ్రవరి 11న నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఏడు కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 2974 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 2836 మంది హాజరైనట్లు సాంఘిక గురుకుల విద్యాలయాల సంస్థ ప్రాంతీయ సమన్వయాధికారి కె శ్రీనివాస్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.