JEE Advance 2025 Admit Card: మరో 4 రోజుల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్ రాత పరీక్ష.. అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ లింక్ ఇదే
దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్ ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్ష సమీపిస్తుంది. జేఈఈ మెయిన్స్ రెండు విడతల్లో ప్రతిభ చూపిన తొలి 2.50 లక్షల మంది విద్యార్ధులు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయనున్నారు. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన..

హైదరాబాద్, మే 13: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ అడ్వాన్స్‌డ్) 2025 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు ఐఐటీ కాన్పూర్ అధికారిక వెబ్‌సైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తమ వివరాలు నమోదు చేసి అడ్మిట్ కార్డులను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 18వ తేదీన దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్లకు జరుగుతుంది. పేపర్ 1 ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నాం 12 గంటల వరకు, పేపర్ 2 మద్యాహ్నాం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరగనుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నేడే తెలంగాణ పాలిసెట్ 2025 పరీక్ష
తెలంగాణ పాలిటెక్నిక్ (డిప్లొమా) కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్ష మంగళవారం (మే 13) జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఓఎమ్‌ఆర్ పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా 276 పరీక్షా కేంద్రాలలో నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,06,716 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.
వారంలో తెలంగాణ ఈసెట్ 2025 ఫలితాలు.. పరీక్షకు 96 శాతం హాజరు
పాలిటెక్నిక్ కోర్సు పూర్తిచేసిన వారికి బీటెక్ సెకండియర్‌లో నేరుగా ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన తెలంగాణ ఈసెట్ పరీక్ష ఫలితాలు మరో వారం రోజుల్లో విడుదల కానున్నాయి. అంటే ఈ నెల 20లోపు ఫలితాలు విడుదల చేయనున్నారన్నమాట. ఈసెట్ పరీక్షను సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 86 పరీక్ష కేంద్రాల్లో ప్రశాంతంగా నిర్వహించారు. మొత్తం 19,672 మందికి 18,928 మంది అంటే 96.22 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. తొలుత ప్రాథమిక కీ, విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను విడుదల చేసి, వీటిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత తుది ‘కీ’ని విడుదల చేసి, ఆపై ఫలితాలు ప్రకటిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.