CBSE Results 2025 Declared: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే!
దేశ వ్యాప్తంగా దాదాపు 42 లక్షల మందికి పైగా విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. పరీక్షలు నిర్వహించి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఫలితాలు ఇంకా వెల్లడికాకపోవడంతో విద్యార్ధుల్లో నెలకొన్న ఆందోళనకు నేటితో చెల్లుచీటి పడినట్లైంది. విద్యార్ధులు ఈకింది డైరెక్ట్ లింక్ ద్వారా మార్కుల మోమోను..

హైదరాబాద్, మే 13: దేశవ్యాప్తంగా దాదాపు 42 లక్షల మందికి పైగా విద్యార్థులు ఎంతో ఉత్కంఘగా ఎదురు చూస్తున్న సీబీఎస్సీ12వ తరగతి ఫలితాలు ఎట్టకేలకు వచ్చేశాయి. ఈ రోజు (మే 13) ఉదయం సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12వ తరగతి ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in, https://cbseresults.nic.in/లలో తమ వివరాలు నమోదుచేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్ధులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డు నంబర్‌లను ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. సీబీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు డిజీలాకర్, ఉమాంగ్ మొబైల్ యాప్‌ల ద్వారా కూడా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
తాజాగా విడుదలైన 12వ తరగతి పలితాల్లో గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం స్వల్పంగా పెరిగింది. ఈ ఏడాది 12వ తరగతి పరీక్షలకు దేశ వ్యాప్తంగా మొత్తం 17,04,367 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వీరిలో 16,92,794 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 14,96,307 మంది విద్యార్థులు తాజా ఫలితాల్లో ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో 33 శాతం మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులైనట్లు బోర్డు ప్రకటిస్తుంది. ఏ విద్యార్థికైనా 33 శాతం మార్కులు సాధించలేకపోతే వారికి 1 మార్కు లేదా అంతకంటే ఎక్కువ తేడాతో తక్కువ మార్కులు వస్తే.. అటువంటి వారికి గ్రేస్ మార్కు(లు) ఇచ్చిపాస్ చేయాలని బోర్డు నిర్ణయించింది.
కాగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈసారి దేశ్యాప్తంగా 7,842 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలకు దాదాపు 42 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే మరో 26 దేశాల్లోనూ ఈ పరీక్షలను నిర్వహించారు. వీరిలో 24.12 లక్షల మంది పదో తరగతి పరీక్షలు రాయగా, 17.88 లక్షల మంది విద్యార్ధులు 12వ తరగతి పరీక్షలు రాశారు. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు 10, 12వ తరగతి పరీక్షలను సీబీఎస్‌ఈ నిర్వహించిన సంగతి తెలిసిందే. సీబీఎస్‌ఈ బోర్డు గత కొన్నేళ్లుగా మెరిట్ జాబితాలను వెల్లడించకుండా.. గ్రేడ్‌లు మాత్రమే ఇస్తున్న సంగతి తెలిసిందే.
సీబీఎస్సీ బోర్డు ఈ రోజు కేవలం 12వ తరగతి ఫలితాలను మాత్రమే విడుదల చేసింది. అయితే 10వ తరగతి ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. వీటిని కూడా త్వరలోనే వెల్లడించే అవకాశాలున్నాయని పలువురు భావిస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.