Andhra Pradesh: జూనియర్ కాలేజీల్లోని గెస్ట్ లెక్చరర్లకు గుడ్‌న్యూస్.. భారీగా జీతాలు పెంచిన కూటమి సర్కార్!
ఎన్నో యేళ్లుగా ఎదురు చూస్తున్న రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్‌లకు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచుతున్నట్లు రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు..

అమరావతి, మే 13: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్‌లకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచుతున్నట్లు రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం గంటకు ఇస్తున్న రూ.150 పారితోషికాన్ని రూ.375కు పెంచడం జరిగింది.
అంటే నెలకు గరిష్టంగా 72 గంటలకు రూ.27 వేలుగా నిర్ణయించిందన్నమాట. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తాజాగా విడుదలైన జీఓలో తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని 475 జూనియర్ కాలేజీల్లో పనిచేసే దాదాపు 1177 మంది గెస్ట్ లెక్చరర్లు లబ్ధి పొందనున్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ ఎడ్యేకేషన్ డైరెక్టరేట్ తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.