Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: దారుణ ఘటన.. 32 అంతస్తుల భవనం పైనుంచి దూకిన సాఫ్ట్‌వేర్‌ టెకీ! జాబ్‌ ఎంతపని చేసింది..

భార్యభర్తలు ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే. చక్కని జీతం.. ఏ లోటూ లేని జీవితం. కానీ ఏదో తెలియని వెలితి. కట్ చేస్తే భర్త ఉన్నట్లుండి తాము నివసిస్తున్న లగ్జరీ అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ప్రాణాలొదిలాడు. తాను పనిచేస్తున్న కంపెనీలో ప్రమోషన్ రావడం లేదనీ, పనికి తగిన గుర్తింపు దక్కట్లేదని ఆవేదనకు గురై చివరికి ప్రాణాలు తీసుకున్నట్లు..

Hyderabad: దారుణ ఘటన.. 32 అంతస్తుల భవనం పైనుంచి దూకిన సాఫ్ట్‌వేర్‌ టెకీ! జాబ్‌ ఎంతపని చేసింది..
Software Employee
Srilakshmi C
|

Updated on: May 12, 2025 | 12:40 PM

Share

హైదరాబాద్‌, మే 12: ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కంపెనీలో పనిభారం తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఓవైపు ప్రమోషన్‌ రాక, మరోవైపు పెరిగిన పని ఒత్తిడితో కుంగుబాటుకు గురైన సదరు ఉద్యోగి తాను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ 32 అంతస్తుపైకి చేరుకుని అక్కడి నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసు స్టేషన్‌ పరిధిలో శనివారం (మే 10) చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్పెక్టర్‌ హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

కోకాపేటలోని బహుళ అంతస్తుల భవనంలోని 1వ టవర్‌లో ఢిల్లీకి చెందిన అమన్‌ జైన్‌ (32), తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. దంపతులు ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే. అమన్‌ జైన్‌ అమెజాన్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. గతకొంత కాలంగా మానసిక కుంగుబాటుతో బాధపడుతున్న అమన్‌.. చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ శనివారం ఉదయం అమన్‌జైన్‌ తాను నివాసం ఉంటున్న టవర్ వన్‌ 32వ అంతస్తుపైకి వెళ్లి.. అక్కడి నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన అమన్ జైన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు.

ఉద్యోగంలో ప్రమోషన్ రావడం లేదని, పని ఒత్తిడి కూడా బాగా పెరిగిందని కుటుంబ సభ్యులతో మృతుడు తరచూ చెప్పేవాడవి, దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.