AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Pak Ceasefire: మసీదులను టార్గెట్ చేసినట్లు భారత్‌పై.. పాక్‌ తప్పుడు ప్రచారం చేసింది: కమాండర్‌ వ్యోమికా

భారత్ - పాక్ రెండు దాయాది దేశాలు నేటి సాయంత్రం 5 గంటల నుంచి భూ, సముద్ర, వాయు మార్గాలలో కాల్పుల విరమణకు అంగీకరించినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతోపాటు పాక్‌ విదేశాంగ శాఖ కూడా అధికారికంగా ప్రకటించారు. దీనిపై భారత సైనికాధికారులు స్పందిస్తూ.. పాక్ సైన్యం తప్పుడు ప్రచారం చేసిందని అన్నారు..

India Pak Ceasefire: మసీదులను టార్గెట్ చేసినట్లు భారత్‌పై.. పాక్‌ తప్పుడు ప్రచారం చేసింది: కమాండర్‌ వ్యోమికా
Indian Commanders
Srilakshmi C
|

Updated on: May 10, 2025 | 7:34 PM

Share

న్యూఢిల్లీ, మే 10: ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించినప్పటి నుంచి పొరుగు దేశాలైన భారత్‌, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా బుధవారం భారత్‌ ‘ఆపరేషన్ సిందూర్’ అనే కోడ్‌నేమ్‌తో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై 25 నిమిషాల్లో 24 క్షిపణులను ప్రయోగించింది. బుధవారం, గురువారం మధ్య రాత్రి, డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి ఉత్తర, పశ్చిమ భారత్‌లోని 15 నగరాల్లోని అనేక సైనిక లక్ష్యాలను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని భారత్ ఆర్మీ భగ్నం చేసింది.

ఉత్తరాన లెహ్ నుంచి దక్షిణాన సర్ క్రీక్ వరకు 26 ప్రదేశాలలో సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్ దాడులను ప్రారంభించిన తర్వాత, నిన్న రాత్రి భారత్ ఉత్తర, పశ్చిమ సరిహద్దులలో తీవ్రమైన డ్రోన్ కార్యకలాపాలు జరిగాయి. పాక్‌ చేసే ప్రతి దాడిని భారత్‌ విజయవంతంగా తిప్పికొట్టింది. ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో కూడా శ్రీనగర్‌లో బహుళ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అదే సమయంలో మూడు పాకిస్తాన్ వైమానిక స్థావరాలలో కనీసం మూడు పేలుళ్లు సంభవించాయి. అయితే ఈ రెండు దేశాలు నేటి సాయంత్రం 5 గంటల నుంచి భూ, సముద్ర, వాయు మార్గాలలో కాల్పుల విరమణకు అంగీకరించినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతోపాటు పాక్‌ విదేశాంగ శాఖ కూడా అధికారికంగా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

దీనిపై భారత సైనికాధికారులు స్పందిస్తూ.. పాక్ సైన్యం తప్పుడు ప్రచారం చేసింది. భారత సైనిక శిబిరాలు, రక్షణ వ్యవస్థలు నాశనం అయ్యాయని తప్పుడు ప్రచారం చేశారు. మీడియా సమావేశాల్లో తప్పుదారి పట్టించేలా పాక్‌ ఆర్మీ అధికారులు మాట్లాడారు. భారత్ సెక్యులర్ దేశం మసీదులు టార్గెట్ చేశారని తప్పుడు ప్రచారం చేశారు. మతపరమైన స్థలాలను భారత్ టార్గెట్ చేయలేదు. భారత్ దాడులతో పాక్ సైన్యం తీవ్రంగా నష్టపోయింది. నిర్ధేశిత లక్ష్యాలపై మాత్రమే దాడి చేశాం. దేశ సార్వ భౌమాధికరాన్ని, సమగ్రతలు కాపాడేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉంది. ఎటువంటి పరిణామాలు ఎదుర్కొనేందుకైనా, ఎంత దూరం వెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నామని భారత రక్షణ అధికారులు శనివారం ప్రకటించారు.

గత కొద్దిరోజులుగా భారత్‌పై పాక్‌ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్ అన్నారు. ఎస్‌-400ను ధ్వంసం చేసినట్టు పాక్ తప్పుడు ప్రచారం చేసింది. పాక్‌ జెఎఫ్‌-17 ఫైటర్స్‌ ఇండియాపై పాక్‌ దాడి చేయలేదు. బ్రహ్మోస్‌ క్షిపిణులను ధ్వంసం చేశారన్నది కూడా నిజం కాదు. శ్రీనగర్, జమ్ము, పఠాన్‌కోడ్, భుజ్‌లోని.. వైమానిక స్థావరాలపై దాడి చేయడం కూడా అవాస్తవమే. ఇందుకు సంబంధించి మేం ఆధారాలను కూడా చూపించాం. మీడియా సమావేశాల్లో పాక్ పూర్తిగా అవాస్తవాలు చెప్పింది. పాక్‌లోని మత సంస్థలపై భారత్ దాడులు చేయలేదు. కేవలం టెర్రిరస్ట్ స్థావరాలనే భారత్ టార్గెట్ చేసింది. పాక్‌లోని 4 వైమానిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసిందని

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.