AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆ మ‌హిళ‌తో మోదీకి చెప్పమ‌న్నారుగా.. నిజంగానే చెప్పింది.. చెప్పాక ఏమైంది..?’ ఆపరేషన్‌ సింధూర్‌పై RGV ట్వీట్

ఏప్రిల్ 22న ఉగ్రమూక పెహల్గాం పర్యాటకులపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడింది. అదీ ఒక్కొక్కరిని మతం అడిగి మరీ అత్యంత పాశవికంగా కాల్చిచంపారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా టూరిస్టుల్లో జంటలుగా ఉన్న వారి వద్దకు వెళ్లి భర్తలను మాత్రమే చంపి, టూరిస్టు మహిళలను మాత్రం..

'ఆ మ‌హిళ‌తో మోదీకి చెప్పమ‌న్నారుగా.. నిజంగానే చెప్పింది.. చెప్పాక ఏమైంది..?' ఆపరేషన్‌ సింధూర్‌పై RGV ట్వీట్
RGV Tweet on Operation Sindoor
Srilakshmi C
|

Updated on: May 08, 2025 | 8:23 PM

Share

జమ్మూకశ్మీర్‌లోని పహల్గం లోయ వద్ద ఏప్రిల్ 22న ఉగ్రమూక ఒక్కసారిగా పర్యాటకులపై కాల్పులకు తెగబడింది. అదీ ఒక్కొక్కరిని మతం అడిగి మరీ అత్యంత పాశవికంగా కాల్చిచంపారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా టూరిస్టుల్లో జంటలుగా ఉన్న వారి వద్దకు వెళ్లి భర్తలను మాత్రమే చంపి, టూరిస్టు మహిళలను మాత్రం టెర్రరిస్టులు వదిలేశారు. ఆవేదనతో తనను కూడా చంపమని ఓ మహిళ కోరగా.. ‘నిన్ను చంపం.. ఓట్లేసి గెలిపించుకున్నారుగా వెళ్లి మోదీకి చెప్పు’ అంటూ కిరాతకంగా రక్తపాతం పారించారు. ఈ ఘటనతో యావత్‌ భార‌తం భగ్గుమంది. మరోవైపు చనిపోయిన భర్త పక్కన దీనంగా కూర్చుని ఏడుస్తున్న మహిళ ఫొటో ప్రపంచ వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాల‌ని సర్వత్రా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భార‌త సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట పాక్‌ ఉగ్రమూకలపై విరుచుకుపడింది.

పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలు, మౌలిక సదుపాయాలు కేంద్రంగా భీకర దాడులు నిర్వహించింది. 9 ఉగ్రవాద స్థావరాలను గుర్తించి వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ వెల్లడించారు. ప్రస్తుతం రెండు దేశాల నడుమ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనిపై భార‌తీయులంతా హ‌ర్షం వ్యక్తం చేశారు. ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత ఇప్పుడు మరో ఫొటో సోషల్‌ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఆ ఫొటోలో టెర్రరిస్టులు మోదీకి చెప్పు అని ఓ వైపు ఉంటే.. మరోవైపు మోదీకి చెప్పాను.. అని ఓ మహిళ కోపంతో ఉగ్రమూక శవాల మధ్య నిల్చొని ఉండ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. దీనిపై టాలీవుడ్‌ డైరెక్టర్‌ తనదైన స్టైల్‌లో ఆప‌రేష‌న్ సిందూర్‌పై ట్వీట్ వేశాడు. ‘పహల్గాం దాడిలో ఉగ్రవాదులు ఓ మహిళ భర్తని చంపి.. వెళ్లి మోడీకి చెప్పు అని అన్నారుగా.. ఇప్పుడు ఆ మహిళ నిజంగానే మోదీకి చెప్పింది’ అంటూ రాంగోపాల్ వర్మ పాక్ ఉగ్రవాదులపై సెటైరికల్‌గా పోస్ట్ చేశారు. కాగా ఆప‌రేష‌న్ సిందూర్ విజయంపై సినీ, క్రీడా, రాజ‌కీయ, వ్యాపార ప్రముఖులు కుల, వర్గ, మతాలతో సంబంధంలేకుండా ప్రతి ఒక్కరూ భార‌త సైన్యాన్ని ప్రశంసిస్తూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.