AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake Video: బాబోయ్‌.. మహిళ చెవిలోకి దూరిన పాము! బయటకు రానంటూ మొరాయింపు.. వీడియో చూశారా?

చాలా మందికి పాములంటే చచ్చేంత భయం. పాము పేరు వినపడినా అల్లంత దూరం ఎగిరిపడతారు. పొరబాటున ఎక్కడైనా చూశారంటే ఇక అంతే వెనక్కి కూడా చూడకుండా పరుగులంకించుకుంటారు. అలాంటిది ఓ పాము ఏకంగా మహిళ చెవిలో దూరిపోయిందండీ.. ఇందుకు సంబంధించిన వీడియో ఈ కింద చూడొచ్చు..

Snake Video: బాబోయ్‌.. మహిళ చెవిలోకి దూరిన పాము! బయటకు రానంటూ మొరాయింపు.. వీడియో చూశారా?
Snake Gets Stuck In Woman Ear
Srilakshmi C
|

Updated on: May 08, 2025 | 6:59 PM

Share

ప్రస్తుతం సమ్మర్ సీజన్‌ కావడంతో ఉక్కపోత, వేడికి తట్టుకోలేక పాములు చల్లని ప్రాంతాలను వెదుక్కుంటూ బయటకు వస్తుంటాయి. అయితే ఈ కాలంలో పాములు ఎక్కువగా ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. ఈ కాలంలో ఇళ్లలో బట్టలలో, కరెంటు బోర్డుల మీద, బూట్లలో, వాహానాల్లో పాములు వెళ్లిదాక్కుంటాయి. అంతేకాకుండా ఇంట్లో చీకటిగా ఉండే ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందుకే వేసవి కాలంలో ఇంటి పరిసర ప్రాంతాల్లో అలర్ట్‌గా ఉండటం చాలా అవసరం. పైగా పాము పేరు వింటేనే చాలా మంది అల్లంత దూరం ఎగిరిపడతారు. చాలా మందికి పాములను దూరం నుంచి చూసినా.. అది తమ ఒడిలోనే ఉన్నట్లు చమటలుపట్టి ఉక్కిరిబిక్కిరై గజగజ వణికిపోతుంటారు. ఈ భయంతో కొందరు చీకట్లో తాడును చూసినా పాముగానే భావిస్తుంటారు.

ముఖ్యంగా చెట్లు, అడవులు, పొలాలకు దగ్గరగా ఇళ్లు ఉండేవాళ్లు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే వేసవిలో నెల మీద పడుకోకపోవడమే బెటర్‌. రాత్రి పూట విషపురుగులు చెవిలో ప్రవేశించే ప్రమాదం లేకపోలేదు. తాజాగా ఓ మహిళకు ఇలాంటి ఓ భయానక అనుభవమే ఎదురైంది. నేలపై నిద్రిస్తున్న సమయంలో ఏకంగా ఓ పాము మహిళ చెవిలోకి దూరింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో.. మహిళ చెవిలో దూరిన మహిళను చూడవచ్చు. అది ఎలా వెళ్లిందో కానీ తెలియదుగానీ పాము పూర్తిగా ఆమె చెవిలోకి దూరిపోయింది. పాము చివర తోక మాత్రమే చెవి బయట కనిపించింది. దీంతో సదరు మహిళ బాధతో విలవిల్లాడిపోయింది. వెంటనే హుటాహుటీన ఆస్పత్రికి తరలించగా వైద్యులు ఎంత ట్రై చేసిన పాము పిల్ల మాత్రం బైటకు రాలేదు. చివరకు డాక్టర్ ఒక ప్లక్కర్ తీసుకుని పాము తోకను పట్టి బైటకు తీసే ప్రయత్నం చేశాడు. వీడియోలో దాని తోకను పట్టుకుని బైటకు లాగడం చూడొచ్చు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదుగానీ చెవిలోకి చిన్న చీమ దూరిపోతేనే అల్లాడిపోతాం కాదా.. అంతపెద్ద పాము చెవిలో దూరుతుంటే సదరు మహిళ స్పృహలో లేకుండా ఎలా ఉందా? అని నెటిజన్లు తెగ ఆశ్చర్యపడిపోతున్నారు. మరికొందరేమో ఇది ఫెక్ రీల్స్ ఏమోనని కొట్టిపారేస్తున్నారు. ఇంతకీ మీరేమంటారూ..?

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్