ISRO Jobs After Class 12: ఇస్రోలో సైంటిస్ట్‌ అవ్వడం మీ డ్రీమా? అయితే ఇంటర్‌ తర్వాత ఈ కోర్సులు చేయండి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో కొలువు సొంతం చేసుకోవాలన్నది ఎందరో యువత కల. అయితే అందుకు ఏం చేయాలో? ఏ కోర్సులు చదవాలో వంటి విషయాలు చాలా మందికి తెలియవు. ఈ విషయాలు మీకోసం.. ఇస్రోలో ఉద్యోగం చేయాలంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌తో 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే అభ్యర్థులు తప్పనిసరిగా ఏవియానిక్స్ ఇంజనీరింగ్, ఆస్ట్రానమీ..

ISRO Jobs After Class 12: ఇస్రోలో సైంటిస్ట్‌ అవ్వడం మీ డ్రీమా? అయితే ఇంటర్‌ తర్వాత ఈ కోర్సులు చేయండి
ISRO Jobs After Class 12
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 26, 2024 | 6:08 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో కొలువు సొంతం చేసుకోవాలన్నది ఎందరో యువత కల. అయితే అందుకు ఏం చేయాలో? ఏ కోర్సులు చదవాలో వంటి విషయాలు చాలా మందికి తెలియవు. ఈ విషయాలు మీకోసం.. ఇస్రోలో ఉద్యోగం చేయాలంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌తో 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే అభ్యర్థులు తప్పనిసరిగా ఏవియానిక్స్ ఇంజనీరింగ్, ఆస్ట్రానమీ లేదా స్పేస్ ఇంజనీరింగ్‌ కోర్సులో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ముఖ్యంగా ISROలో సైంటిస్ట్‌గా చేరాలంటే ఇంటర్మీడియట్‌ తర్వాత ఈ కింది కోర్సులో చదివితే కొలువు మీ పాదాల వద్ద చేరుతుంది. అవేంటంటే..

ఇస్రోలో ఉద్యోగం ఎలా పొందాలి?

ఇటీవల IISc, IIT, NIT వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారికి ISROలో కొలువు దక్కించుకున్నారు. B.Tech ప్రోగ్రామ్‌లలో మెరకాల్లాంటి అభ్యర్థులను ఇస్రో ఎంపిక చేసుకుంటుంది. ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్‌లో అత్యుత్తమ ప్రతిభకనబరచాలి. IIST (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ)లో చదివిన వారిలో అధిక మంది ప్రతీయేట ISROలో కొలువులు దక్కించుకుంటూ ఉంటారు. మరో ముఖ్య విషయం ఏంటంటే కనీసం 7.5 CGPA తప్పనిసరిగా ఉండాలి.

ఇస్రోలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఏటా ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఎగ్జామ్ (ICRB)ని నిర్వహిస్తుంది. ఈ పరీక్షకు BE, B.Tech, B.Sc (ఇంజనీరింగ్), లేదా డిప్లొమా + బీఈ/బీటెక్ (లాటరల్ ఎంట్రీ) డిగ్రీపూర్తి చేసిన అభ్యర్ధులు అర్హులు. కంప్యూటర్, మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్ స్ట్రీమ్‌లలో నైపుణ్యం కలిగిన విద్యార్థులను ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఎగ్జామ్ (ICRB) సెలక్ట్ చేస్తుంది. BE/B టెక్‌లో ఫస్ట్-క్లాస్ డిగ్రీ, కనీసం 65% లేదా CGPA 6.84 పొందిన అభ్యర్థులు ఇస్రోలో ఉద్యోగాలకు అర్హులుగా పరిగణించబడతారు. అలాగే జేఈఈ అడ్వాన్స్‌డ్, కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన లేదా IISER నిర్వహించే రాష్ట్ర, సెంట్రల్ బోర్డ్ ఆధారిత ఆప్టిట్యూడ్ పరీక్షలలో మంచి ర్యాంక్ సాధించి ఉండాలి.

ఇవి కూడా చదవండి

12వ తరగతి తర్వాత ఇస్రోలో చేరాలంటే ఈ కింది కోర్సుల్లో ప్రవేశాలు పొందాలి..

ఇస్రోలో కొలువు సొంతం చేసుకోవాలంటే హైస్కూల్, ఇంటర్మీడియట్ చదివేటప్పుడే సైన్స్, మ్యాథమేటిక్స్‌, ఫిజక్స్‌పై మంచి పట్టు ఉండాలి. 75 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి.

  • ఏవియానిక్స్ ఇంజినీరింగ్‌లో బీటెక్
  • B.Tech+MS/M.Tech
  • ఫిజిక్స్‌లో బ్యాచిలర్స్ (BSc ఫిజిక్స్)
  • ఫిజిక్స్‌లో మాస్టర్స్ (MSc ఫిజిక్స్)
  • ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ
  • ఇంజినీరింగ్ ఫిజిక్స్‌లో బీటెక్ + సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, ఆస్ట్రానమీ, ఎర్త్ సిస్టమ్ సైన్స్‌లో ఎంఎస్/ ఆప్టికల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్
  • ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో బీటెక్
  • ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ
  • ఖగోళ శాస్త్రంలో మాస్టర్స్ (MSc ఆస్ట్రానమీ)
  • ఖగోళ శాస్త్రంలో పీహెచ్‌డీ
  • ఇంజినీరింగ్‌లో B.Tech + M.Tech (మెకానికల్, ఎలక్ట్రికల్, CS)

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?
అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..
అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో కూడా ఓ పాపకు పాజిటివ్
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో కూడా ఓ పాపకు పాజిటివ్
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా