NHB Recruitment 2024: నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌లో కొలువులకు నోటిఫికేషన్‌ విడుదల.. డిగ్రీ పాసైన వారు అర్హులు

భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌.. రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద అగ్రశ్రేణి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలో చేరడానికి అభ్యర్థులకు సువర్ణావకాశాన్ని అందిస్తుంది. హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలను ప్రోత్సహించడంలో, హౌసింగ్ ఫైనాన్స్ రంగ స్థిరత్వాన్ని నిర్ధారించడంలో ఎన్‌హెచ్‌బీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తాజాగా వెలువడిన..

NHB Recruitment 2024: నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌లో కొలువులకు నోటిఫికేషన్‌ విడుదల.. డిగ్రీ పాసైన వారు అర్హులు
National Housing Bank
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 26, 2024 | 3:38 PM

భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌.. రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద అగ్రశ్రేణి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలో చేరడానికి అభ్యర్థులకు సువర్ణావకాశాన్ని అందిస్తుంది. హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలను ప్రోత్సహించడంలో, హౌసింగ్ ఫైనాన్స్ రంగ స్థిరత్వాన్ని నిర్ధారించడంలో ఎన్‌హెచ్‌బీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తాజాగా వెలువడిన నోటిఫికేషన్‌ కింద మొత్తం 45 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిల్లో 23 పోస్టులను రెగ్యులర్‌ ప్రాతిపదికన, 25 కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, చీఫ్ ఎకనామిస్ట్, తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఆసక్తి కలిగిన వారు జూన్‌ 29, 2024వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. జులై 19, 2024వ తేదీతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగుస్తుంది. రాత పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష వివరాలు, ఆయా పోస్టులకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం తదితర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు..

రెగ్యులర్ పోస్టులు మొత్తం 23

  • జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్ ఫైనాన్స్) పోస్టులు: 1
  • అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (క్రెడిట్) పోస్టులు: 1
  • డిప్యూటీ మేనేజర్ (క్రెడిట్) పోస్టులు: 3
  • అసిస్టెంట్ మేనేజర్ (జనరలిస్టులు) పోస్టులు: 18

కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసే పోస్టులు మొత్తం 25

  • చీఫ్ ఎకనామిస్ట్ (3 సంవత్సరాలు) పోస్టులు: 1
  • అప్లికేషన్ డెవలపర్ (3 సంవత్సరాలు) పోస్టులు: 1
  • సీనియర్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఆఫీసర్ (3 సంవత్సరాలు) పోస్టులు: 10
  • ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఆఫీసర్ (3 సంవత్సరాలు) పోస్టులు: 12
  • ప్రోటోకాల్ ఆఫీసర్ (ఢిల్లీ) (3 సంవత్సరాలు) పోస్టులు: 1

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.