AP TET 2024 New Notification: ‘వారందరికీ త్వరలోనే మళ్లీ టెట్ పరీక్ష.. ఆ తర్వాతే మెగా డీఎస్సీ’ మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ టెట్) - 2024 ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్ పరీక్షకు మొత్తం 2,35,907 మంది హాజరుకాగా.. వారిలో 1,37,903 మంది అంటే 58.04 శాతం మంది అర్హత సాధించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల కోసం నిర్వహించిన పేపర్-1 పరీక్షను 1,13,296 మంది రాయగా..
అమరావతి, జూన్ 26: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ టెట్) – 2024 ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్ పరీక్షకు మొత్తం 2,35,907 మంది హాజరుకాగా.. వారిలో 1,37,903 మంది అంటే 58.04 శాతం మంది అర్హత సాధించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల కోసం నిర్వహించిన పేపర్-1 పరీక్షను 1,13,296 మంది రాయగా, 75,142 (66.32 శాతం) మంది అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2కు 1,19,500 మంది హాజరుకాగా, 60,846 (50.92 శాతం) మంది అర్హత సాధించారు.
ఏపీ టెట్ ఫలితాల్లో క్వాలిఫై అయిన వారందరికీ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫలితాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారని తెలిపారు. టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులందరూ త్వరలో వెలువడనున్న మెగా డీఎస్సీకి సన్నద్ధం కావాలని లోకేశ్ పిలుపు నిచ్చారు. టెట్‌లో అర్హత సాధించని వారు నిరవాశకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు. వారితోపాటు కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి అవకాశం కల్పిస్తూ త్వరలోనే మరోసారి టెట్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. తొలుత టెట్ పరీక్ష నిర్వహించి, అనంతరం మెగా డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
AP Govt has released the AP TET results today. 2.35 lakh unemployed teachers have been eagerly awaiting the results since TET marks will offer 20% weightage for DSC. I offer my warm congratulations to all the aspirants who have qualified TET. I also wish the best for aspirants…
— Lokesh Nara (@naralokesh) June 25, 2024
కాగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీకి టెట్ అర్హతతోపాటు 20శాతం వెయిటేజీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందుకే నిరుద్యోగులు టెట్ వెయిటేజీ పెంచుకోవడానికి టెట్ పరీక్ష నిర్వహించిన ప్రతీసారి పోటీపడుతుంటారు. ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా 2.35లక్షల మందికి పైగా అభ్యర్థులు టెట్ పరీక్షలు రాయగా.. వారిలో 58.04 శాతం మంది హాజరయ్యారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.