Education: మన ఎడ్యుకేషన్ మార్కెట్ లో కో అంటే కోట్లు.. కానీ కింద నుంచి ర్యాంకులు.. దీనికి కారణం ఏమిటి?

ఇండియన్ ఎడ్యుకేషన్ మార్కెట్ విలువ ఎంత? ఈ క్వశ్చన్ మదిలో మెదలగానే చాలా లెక్కలు గుర్తుకొస్తాయి. నిజానికి రూపాయి కూడా లాభాపేక్ష లేకుండా విద్యను అందించాల్సిన అవసరం ఉంది. కానీ, పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు భారీగా ఖర్చుపెట్టాలని డిసైడ్ అవుతున్నారు. మరి ఆ పెడుతున్న ఖర్చెంత? దాని విలువెంత? సింపుల్ గా చెప్పమంటారా.. దాని విలువ దాదాపు 18 లక్షల కోట్ల రూపాయిలు.

Education: మన ఎడ్యుకేషన్ మార్కెట్ లో కో అంటే కోట్లు.. కానీ కింద నుంచి ర్యాంకులు.. దీనికి కారణం ఏమిటి?
Education Market In India (11)
Follow us

| Edited By: Ravi Panangapalli

Updated on: Jun 27, 2024 | 11:14 AM

ఇండియన్ ఎడ్యుకేషన్ మార్కెట్ విలువ ఎంత? ఈ క్వశ్చన్ మదిలో మెదలగానే చాలా లెక్కలు గుర్తుకొస్తాయి. నిజానికి రూపాయి కూడా లాభాపేక్ష లేకుండా విద్యను అందించాల్సిన అవసరం ఉంది. కానీ, పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు భారీగా ఖర్చుపెట్టాలని డిసైడ్ అవుతున్నారు. మరి ఆ పెడుతున్న ఖర్చెంత? దాని విలువెంత? సింపుల్ గా చెప్పమంటారా.. దాని విలువ దాదాపు 18 లక్షల కోట్ల రూపాయిలు. అసలు ఈ నెంబర్ ను ఎవరైనా ఊహించగలరా? అసలింత నెంబర్ కు కారణాలేమిటో, ఈ రంగం భవిష్యత్ ఏమిటో డీటైల్డ్ గా చూద్దాం.

2025 నాటికి ఎడ్యుకేషన్ మార్కెట్ విలువ దాదాపు రూ.18 లక్షల కోట్లు

Education Market In India (1)

Education Market In India (1)

పేదరికాన్ని అంతం చేసే ఒకే ఒక్క ఆయుధం చదువు. దురదృష్టవశాత్తు ఆ చదువు అందించడం కోసం పేదరికాన్ని కూడా లెక్క చేయడం లేదు. ఒక డ్రైవర్, తోపుడుబండిపై కూరగాయలు అమ్ముకునే వర్తకుడు, మోస్తరు జీతం తీసుకునే ఉద్యోగి.. వీళ్లలో చాలామంది డబ్బిచ్చే చదువు కొనుక్కుంటున్నారు. అందుకే, ప్రస్తుతం విద్య రంగం మార్కెట్ సైజు 2025 నాటికి దాదాపు 225 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. అటుఇటుగా ఇది 18 లక్షల కోట్లు. మరో ఆరేళ్లలో అంటే, 2030 నాటికి ఈ విలువ 313 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే, దేశంలో పిల్లల చదువుల కోసం పేదవాళ్ల నుంచి ధనికుల వరకు పెడుతున్న ఖర్చు సుమారు 18 లక్షల కోట్ల రూపాయలు. ఇంటర్ వరకు చదివించడానికి ఒక్క విద్యార్ధిపై తల్లిదండ్రులు పెడుతున్న ఖర్చు సుమారు 10 నుంచి 12 లక్షల రూపాయలు. ఇది ఓ ఐదారేళ్ల క్రితం మాట. ఇప్పుడు పెద్ద స్కూల్స్ లో అయితే కనీసం 15 లక్షలకు చేరుకుని ఉంటుందని అంచనా. ఇండియాలో మీ పిల్లలను ఏం చేద్దాం అనుకుంటున్నారని అడిగితే.. డాక్టర్, ఇంజినీర్ అనే సమాధానం ఇస్తారు. ఇప్పటి లెక్కల ప్రకారం డాక్టర్ చదువుకు 50 లక్షలు, ఇంజినీరింగ్ చదువుకు తక్కువలో తక్కువగా 5 లక్షలు ఖర్చు చేస్తున్నారు. సో, ఇండియన్ ఎడ్యుకేషన్ మార్కెట్ సైజ్ సో బిగ్.

మనవాళ్లు చదువు కోసం పెడుతున్న ఖర్చు.. మన జీడీపీలో దాదాపు 2.9 శాతం

Education Market In India (2)

Education Market In India (2)

ఇండియాలో ప్రతీ పది మంది తల్లిదండ్రుల్లో 9 మంది.. తమ పిల్లలను పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివించాలని గట్టిగా ఫిక్స్ అవుతున్నారు. దానికి తగ్గట్టే ఆదాయ మార్గాలనూ అన్వేషిస్తున్నారు. పిల్లల చదువుకు కావాల్సిన డబ్బు కోసం ఫ్యూచర్ ప్లానింగ్‌లో ఉంటున్నారు. అందుకే, స్వాతంత్రం వచ్చినప్పుడు ఇండియాలో అక్షరాస్యత 12 శాతం మాత్రమే ఉంటే.. ఇప్పుడు 77 శాతానికి చేరింది. ఎలాగైనా పిల్లలకు ఉన్నత చదువులు అందించాల్సిందేనని తల్లిదండ్రుల్లో ఉన్న బలమైన కోరికే దీనికి కారణం. తాజా లెక్కల ప్రకారం దేశ ప్రజలు చదువు కోసం పెడుతున్న ఖర్చు మన జీడీపీలో దాదాపు 2.9 శాతం. సో, ఇండియన్ ఎడ్యుకేషన్ సెక్టార్ విలువ రానురాను ఎంత పెరుగుతుందో ఊహించొచ్చు.

ఇండియాలో 15 లక్షల స్కూళ్లు.. 97 లక్షలకు పైగా టీచర్లు!

Education Market In India (3)

Education Market In India (3)

ఇది ఇక్కడితోనే ఆగిపోదు. ఎందుకంటే, ప్రపంచంలోనే యువత ఎక్కువగా ఉన్న దేశం ఇండియా మాత్రమే. సో, నెక్ట్స్ జనరేషన్ కూడా భారీగానే ఉంటుంది. అందులోంచి కూడా ఎడ్యుకేషన్ సెక్టార్‌కు లక్షల కోట్లు వచ్చి చేరుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఇండియాలో 5 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్న వారి సంఖ్య 58 కోట్లు. 5 నుంచి 24 ఏళ్ల వయసంటే అంతా చదువుకుంటున్న వారి కిందే పరిగణించాలి. అమెరికా మొత్తం జనాభాను లెక్కేసినా 50 కోట్లు ఉండరు. సో మన దగ్గరున్న ఈ 58 కోట్లలో 27 కోట్ల మంది స్కూల్‌ ఎడ్యుకేషన్‌లో ఉన్నారు. దేశ జనాభాలో 27 శాతం మంది 14 సంవత్సరాల లోపు ఉన్నవారే. సో, ఇండియాలో చదువుకుంటున్న వారి సంఖ్య ఎంత పెద్దదో ఊహించొచ్చు. అందుకే, ఇండియాలో 15 లక్షల స్కూళ్లు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 97 లక్షలకు పైగా టీచర్లు ఉన్నప్పటికీ.. ఈ సంఖ్య కోటి వరకు ఉండొచ్చని అంచనా. 2023 సెప్టెంబర్ నాటికి 49వేల 385 కాలేజీలు ఇండియాలో ఉన్నాయి. ఇక ఇండియాలో ఉన్న మొత్తం యూనివర్సిటీలు 1196. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్- బెంగళూరు సహా ఎనిమిది ఐఐటీలు టాప్-500 యూనివర్సిటీల జాబితాలో ఉన్నాయి. 2023లో టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో 100 ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్స్ అర్హత సాధించాయి. ఇంత భారీస్థాయిలో విద్యారంగ వ్యవస్థ విస్తరించి ఉంది కాబట్టే.. విదేశీ పెట్టుబడులు కూడా వెల్లువలా వస్తున్నాయి.

2000 – 2023 మధ్య దేశ విద్యారంగంలో FDIలు 9.44 బిలియన్ డాలర్లు

Education Market In India (4)

Education Market In India (4)

దేశ విద్యారంగంలో క్వాలిటీని పెంచడం కోసం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా ఆహ్వానించింది భారత ప్రభుత్వం. 2000 ఏప్రిల్ నుంచి 2023 సెప్టెంబర్ వరకు దేశ విద్యా రంగంలో వచ్చిన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ 9.44 బిలియన్ డాలర్లు. ఇండియాలో ఉన్న ఎడ్యుటెక్ స్టార్టప్ కంపెనీలే 2022లో ఏకంగా 3.94 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. ఇవన్నీ ఇండియన్ ఎడ్యుకేషన్ సత్తాకు కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే.

కేరళ స్కూళ్లలో పాఠాలు చెప్పే ఏఐ రోబో టీచర్

Education Market In India (5)

Education Market In India (5)

కొత్త టెక్నాలజీని ప్రపంచం సృష్టిస్తుండొచ్చు గాక. దాన్ని ముందుకు తీసుకెళ్తున్నది మాత్రం ఇండియానే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అమెరికా లాంటి దేశాలు భారీ పరిశోధనలు స్తుండొచ్చు. కాని, దానికి కావాల్సిన నాలెడ్జ్ అనే ముడిసరుకు మొత్తం ఇండియాలోనే దొరుకుతోంది. కేరళలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారుచేసిన ఓ రోబో టీచర్‌ను క్లాస్ రూమ్‌లో ప్రవేశపెట్టారు. ఐరిస్ అని పేరు పెట్టిన ఆ రోబో టీచరమ్మ పిల్లలకు పాఠాలు చెబుతుంది. మీకు తెలుసా అమెజాన్ వంటి మల్టీ నేషనల్ కంపెనీ కూడా ఇండియన్ ఎడ్యుకేషన్ సెక్టార్ పవర్ చూసి ఫిదా అయింది. అందుకే, గ్లోబల్ కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేసి ఇండియాలో అమలు చేస్తోంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా లక్ష మంది విద్యార్ధులకు కంప్యూటర్ సైన్స్ చదివే అవకాశం కల్పించింది. టెక్నాలజీ వరల్డ్‌లో మెషీన్ లెర్నింగ్ అనేది ఒక బిగ్ ఛేంజ్ మ్యాటర్. సో, అమెజాన్ ఇండియా మెషీన్ లెర్నింగ్ సమ్మర్ స్కూల్ సెకండ్ ఎడిషన్‌ను కూడా స్టార్ట్ చేసింది.

ఇండియా కూడా సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా ఇండియా కూడా తనను తాను మార్చుకుంటోంది. అందుకే, అటల్ టింకరింగ్ ల్యాబ్ పేరుతో ఓ ప్రాజెక్ట్ మొదలుపెట్టింది భారత ప్రభుత్వం. దీని ఉద్దేశం ఒక్కటే 10+2 విద్యార్ధులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్‌పై నాలెడ్జ్ అందిస్తుంది. నిజానికి అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్టులో భాగంగానే కేరళకు చెందిన మేకర్ ల్యాబ్స్ ఎడ్యుటెక్ సంస్థ ఐరిస్‌ను సృష్టించింది. సో, టెక్నాలజీని ఈ లెవెల్‌లో ముందుకు తీసుకెళ్తున్న దేశం ఇండియా ఒక్కటే. దీనికి కారణం మార్పులను స్వీకరిస్తున్న మన విద్యారంగ వ్యవస్థనే.

74 దేశాల విద్యార్థులను పరీక్షిస్తే.. కింద నుంచి 2వ స్థానంలో నిలిచిన భారత్

Education Market In India (6)

Education Market In India (6)

చివరిగా ఇక్కడో విషయం చెప్పుకోవాలి. ఒక విద్యార్ధి చదువు కోసం తల్లిదండ్రులు ఏడాదికి కనీసం లక్ష రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇది ప్రైవేట్ విద్య కోసం. విచిత్రమేంటంటే.. ప్రభుత్వం కూడా దాదాపుగా అంతే ఖర్చు పెడుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఒక్కో విద్యార్ధిపై పెడుతున్న ఖర్చు సుమారు 65 వేల రూపాయలు. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక్కో విద్యార్ధిపై 90 వేల రూపాయల వరకు ఖర్చు చేస్తోంది. అంటే, ప్రైవేట్ స్కూల్ విద్యార్ధులకు, ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్ధులకు పెడుతున్న ఖర్చు దాదాపుగా సమానం. ఇంకో విషయం ఏంటంటే.. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్‌లోనూ పెద్దగా మార్పు లేదని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ప్రైవేట్ స్కూళ్లలో ఎడ్యుకేషన్ కాస్త మెరుగ్గా ఉండొచ్చేమో. అదే ఇంటర్నేషనల్ స్కూళ్లలో అయితే ఇంకాస్త ఎక్కువ మెరుగైన విద్య అందుతోంది. ఇక మిగతా స్కూళ్లలో చదువు అంతంత మాత్రమే. బట్టీ విధానాన్నే స్కూళ్లు అమలు చేస్తున్నాయి. పరీక్షల్లో వస్తాయనుకునే కొన్ని ప్రశ్నలకే సమాధానం బట్టీ పట్టించి, పరీక్షల్లో రాయించి, పాస్ అయ్యేలా చేస్తున్నారు. దాన్నే గొప్ప ఎడ్యుకేషన్‌గా భావిస్తున్నారు తల్లిదండ్రులు. నిజానికి కొన్ని దేశాల్లో పాస్ మార్కులు, సర్టిఫికెట్ల గురించి పట్టించుకోరు. విషయాన్ని పిల్లలు అర్ధం చేసుకుంటున్నారా, మ్యాథ్స్‌ను ఎలా ఉపయోగిస్తున్నారు. లాజికల్ అండ్ సైన్స్‌లో పిల్లలకు ఉన్న విషయ పరిజ్ఞానం ఎంత అన్నదానిపైనే ఫోకస్ చేస్తారు. బట్టీ పట్టే విద్యార్ధులకు ఇలాంటివేమీ రావు. అందుకే, 74 దేశాల విద్యార్ధులను పరీక్షించినప్పుడు అందులో అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలిచింది ఇండియా.

పరీక్షలు, పాస్ అవడాలు లేని సరికొత్త జాతీయ విద్యా విధానంతో మేలు

Education Market In India (7)

Education Market In India (7)

అలాగని క్వాలిటీ ఎడ్యుకేషన్ ను అందించడంలో ఇండియా మరీ ఘోరంగా ఏమీ లేదు. ప్రపంచ మేధావులను అందించిన చరిత్ర మనది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి కంపెనీలను నడిపిస్తున్నది భారతీయులే. వారి ఉన్నత విద్యాభ్యాసం జరిగిందంతా ఇండియాలోనే. కాకపోతే, కొన్ని అవరోధాలు కూడా ఉన్నాయి. దాన్ని క్లియర్ చేస్తే ఇండియాకు తిరుగులేదు. ఆ ప్రయత్నంలో భాగంగానే జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. పరీక్షలు, పాస్ అవడాలు లేని సరికొత్త విద్యా విధానం ఇది. అప్పుడిక రుద్దుళ్లు ఉండవు. బట్టీ పట్టడాలు కనిపించవు. చదువు కోసం లక్షలకు లక్షలు పెట్టాల్సిన అవసరమూ రాదు. ఫైనల్‌గా చెప్పొచ్చేది ఒక్కటే. భారత విద్యా వ్యవస్థ అత్యద్భుతంగా మారబోతోంది. మార్పులను స్వీకరిస్తున్నందువల్లే ఆ అద్భుతం సాక్షాత్కారం కాబోతోంది.

ఇప్పుడు ప్రపంచంలో ఏ రంగంలో చూసినా ఏఐ టెక్నాలజీని వినియోగం పెరుగుతోంది. దానివల్ల ఉద్యోగాలు పోతున్నాయి అన్న వాదన ఉన్నా.. ఆ టెక్నాలజీని ఉపయోగించడం వచ్చినవారికి మాత్రం ఫుల్ డిమాండ్ ఉంటుందని ఈజీగా చెప్పవచ్చు. అందుకే ఇప్పుడు విద్యార్థులు రెగ్యులర్ స్టడీస్ తో పాటు అదనంగా ఏఐ టెక్నాలజీలో ప్రాంప్ట్ ఇంజనీర్లుగా మారడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. దీనివల్ల ఎడ్యుకేషన్ తో పాటు ఈ ఇండస్ట్రీలోనూ కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. సో.. టెక్నాలజీని ఎంత బాగా వినియోగించుకుంటే అంత ఉజ్వల భవిష్యత్తు ఈ రంగంలో ఉందని నిపుణులు చెబుతున్నారు. కరోనా వల్ల విద్యావ్యవస్థలో టెక్నాలజీ వినియోగం పెరిగింది. ఇది ఏఐని నేర్చుకోవడానికి ఉపయోగపడుతోంది.

ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తోడవుతుండడంతో.. ప్రపంచంలోనే అతిపెద్ద రెండో విద్యావ్యవస్థగా భారత్ సగర్వంగా తలెత్తుకోబోతోంది. ఏఐ కారణంగా దేశ విద్యా విధానమే సమూలంగా మారబోతోంది కూడా. దీనికి కావలసిన మౌలిక వసతులను దేశవ్యాప్తంగా ప్రభుత్వం కాని సమకూర్చగలిగితే.. మన ఎడ్యుకేషన్ సెక్టార్ కు కాని, మన భావితరాల భవిష్యత్ కు కాని తిరుగుండదు అనే చెప్పాలి.

మరిన్ని ప్రీమియం వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
పరిమితి పెరుగుతుందా? పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ వస్తుందా?
పరిమితి పెరుగుతుందా? పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ వస్తుందా?