Heavy Rains: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. గుజరాత్, రాజస్థాన్, సహా 14 రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించిన ఐఎండీ
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్‌లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొడైనార్ జిల్లాలో వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. గిర్ సోమనాథ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
రుతుపవనాల ఆగమనంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వడగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉత్తర భారత్ భారీ వర్షాలతో ఉపిరి పీల్చుకుంది. రానున్న రోజుల్లో వేడి నుంచి ఉపశమనం లభించవచ్చని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. రానున్న 3-4 రోజులలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. నైరుతి రుతుపవనాల ప్రభాంతో గుజరాత్ , రాజస్థాన్ , ఒడిశా , ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్‌లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొడైనార్ జిల్లాలో వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. గిర్ సోమనాథ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు , వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.బనస్కాంతలో కూడా కుండపోత వర్షం కురిసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇళ్ల లోకి వరదనీరు ప్రవేశించడంతో కష్టాలు పెరిగాయి.
రాజస్థాన్ లోని ధోల్‌పూర్‌లో కూడా భారీ వర్షం కురిసింది. ఆకస్మిక వరదలతో ప్రజలు తల్లడిల్లారు. పలు వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. వరదనీరు బయటకు పోయేందుకు ఎలాంటి మార్గం లేదని స్థానికులు తల్లడిల్లుతున్నారు. ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తెహ్రీ డ్యాం లోకి పలు వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో అధికారులు భారీ సహాయక చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది డ్యాంలో చిక్కుకుపోయిన వాహనాలను పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. రుద్రప్రయాగ్‌తో పాటు పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ . రాజధాని భువనేశ్వర్‌లో కుండపోత వర్షం కురిసింది . లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంజా , రాయ్‌ఘడ్ , గజపతి , కందమాల్ , మయూర్‌భంజ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
అటు మహారాష్ట్ర, గోవా, కర్ణాటకల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈశాన్య భారతదేశంలోని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కింలలో జూన్ 27, జూన్ 30 మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలకు ఎండల తీవ్రత నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది.
అదే సమయంలో, జూన్ 28 నుండి 30 వరకు వాయువ్య భారతదేశంలోని చాలా ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్‌లలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇది కాకుండా, జూన్ 27, 28 తేదీలలో తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షపాతం కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది.
दैनिक मौसम परिचर्चा (26.06.2024)
YouTube : https://t.co/s18Pq6XHjhFacebook : https://t.co/pjErnBJMef#weatherupdate #rainfall #rainalerts #rain@moesgoi @DDNewslive @ndmaindia @airnewsalerts pic.twitter.com/2wMiZgB4Ch
— India Meteorological Department (@Indiametdept) June 26, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..