Indian Navy Jobs: పదోతరగతి అర్హతతో ఇండియన్‌ నేవీలో 127 ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపికలు..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ నేవీ (Indian Navy ).. సివిలియన్‌ పోస్టుల (civilian posts)భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

Indian Navy Jobs: పదోతరగతి అర్హతతో ఇండియన్‌ నేవీలో 127 ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపికలు..
Defence Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 26, 2022 | 9:04 PM

Indian Navy Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ నేవీ (Indian Navy ).. సివిలియన్‌ పోస్టుల (civilian posts)భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను అబ్సార్‌ప్షన్‌ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 127

పోస్టుల వివరాలు: ఫార్మసిస్ట్‌, ఫైర్‌ మెన్‌, పెస్ట్‌కంట్రోల్‌ వర్కర్‌ పోస్టులు

అర్హతలు: పోస్టును బట్టి మెట్రిక్యులేషన్‌ లేదా తత్సమాన అర్హత ఉండాలి.

పే స్కేల్‌: ఫార్మసిస్ట్‌ పోస్టులకు నెలకు రూ. 29,200 ఫైర్‌ మెన్‌ పోస్టులకు నెలకు రూ. 19,900 పెస్ట్‌కంట్రోల్‌ వర్కర్‌ పోస్టులకు నెలకు రూ. 18,000లు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌, వెస్టర్న్‌ నావెల్‌ కమాండ్‌, బాల్లాడ్‌ పీర్‌, టైగర్‌ గేట్, ముంబాయి 400001.

దరఖాస్తులకు చివరి తేదీ: నోటిఫికేషన్‌ విడుదలైన 60 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి (ఏప్రిల్‌ 25, 2022).

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NVS Non-Teaching posts 2022: నవోదయ నాన్‌టీచింగ్ పోస్టులకు హాల్‌ టికెట్లు విడుదల.. పరీక్ష తేదీలివే..