IBPS SO/SPL Recruitment 2023: పలు ప్రభుత్వ బ్యాంకుల్లో 1402 ఉద్యోగాలకు ఐబీపీఎస్ నోటిఫికేషన్.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్).. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 1,402 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్‌పీ ఎస్‌పీఎల్-XIII) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 21, 2023. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరీకి చెందినవారు..

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్).. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 1,402 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్‌పీ ఎస్‌పీఎల్-XIII) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 21, 2023. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరీకి చెందినవారు రూ.850, ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులు రూ.175 ఫీజుగా చెల్లించాలి. ప్రిలిమినరీ, మెయిన్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అర్హతలు..
పోస్టును బట్టి కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా తత్సమాన స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్‌లో ఉత్తీర్ణత ఉంది. అగ్రికల్చర్/ హార్టికల్చర్/ యానిమల్ హస్బెండరీ/ వెటర్నరీ సైన్స్/ డెయిరీ సైన్స్/ ఫిషరీ సైన్స్/ పిసి కల్చర్/ అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్/ కో-ఆపరేషన్ అండ్ బ్యాంకింగ్/ఆగ్రో-ఫారెస్ట్రీ/ ఫారెస్ట్రీ తత్సమాన కోర్సులో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఎంఎస్, ఎంబీఏ, పీజీడీబీఏ, పీజీడీబీఎం, పీజీపీఎం, పీజీడీఎం కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు ఆగస్టు 1, 2023వ తేదీ నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఏయే బ్యాంకులు రిక్రూట్‌మెంట్‌లో పాల్గొంటాయంటే..
బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.




పోస్టుల వివరాలు..
- ఐటీ ఆఫీసర్ (స్కేల్-1) పోస్టులు: 120
- అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్(స్కేల్-1) పోస్టులు: 500
- రాజ్‌భాష అధికారి (స్కేల్-1) పోస్టులు: 41
- లా ఆఫీసర్ (స్కేల్-1) పోస్టులు: 10
- హెచ్ఆర్/ పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-1) పోస్టులు: 31
- మార్కెటింగ్ ఆఫీసర్(స్కేల్-1) పోస్టులు: 700
ముఖ్యమైన తేదీలు…
- ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రక్రియ ప్రారంభ తేదీ: ఆగస్టు 1, 2023.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 21, 2023.
- అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ (ప్రిలిమినరీ పరీక్ష): డిసెంబర్ 2023.
- ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఆగస్టు 30, 31
- ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి తేదీ: జనవరి, 2024.
- ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్: జనవరి, 2024.
- ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేదీ: జనవరి 28, 2024.
- మెయిన్ పరీక్ష ఫలితాల ప్రకటన తేదీ: ఫిబ్రవరి, 2024.
- ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్‌లోడ్: ఫిబ్రవరి/మార్చి 2024.
- ఇంటర్వ్యూ నిర్వహణ: ఫిబ్రవరి/మార్చి, 2024.
- ప్రొవిజినల్ అలాట్‌మెంట్: ఏప్రిల్, 2024.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.




