AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Inter Admissions 2023: ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల గడువు మరోమారు పొడిగింపు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్‌ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రవేశాల గడువు గతంలో జులై 25తో ముగియగా ఇంటర్‌ బోర్డు జులై 31వ తేదీ వరకు పొడిగించింది. ఆ తర్వాత ఆగస్టు 5 వరకు గడువు పొడిగించింది. తాజాగా మరోమారు ప్రవేశాల గడువు పొడిగిస్తూ ఇంటర్‌ బోర్డు ప్రకటన వెలువరించింది. ఈ మేరకు ఆగస్టు 5 వరకు ఉన్న గడువును..

TS Inter Admissions 2023: ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల గడువు మరోమారు పొడిగింపు
TSBIE
Srilakshmi C
|

Updated on: Aug 01, 2023 | 3:07 PM

Share

హైదరాబాద్‌, ఆగస్టు 1: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్‌ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రవేశాల గడువు గతంలో జులై 25తో ముగియగా ఇంటర్‌ బోర్డు జులై 31వ తేదీ వరకు పొడిగించింది. ఆ తర్వాత ఆగస్టు 5 వరకు గడువు పొడిగించింది. తాజాగా మరోమారు ప్రవేశాల గడువు పొడిగిస్తూ ఇంటర్‌ బోర్డు ప్రకటన వెలువరించింది. ఈ మేరకు ఆగస్టు 5 వరకు ఉన్న గడువును ఆగస్టు 16వ తేదీ వరకూ పొడిగిస్తూ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్ ప్రకటన వెలువరించారు.

గడువు తేదీ తర్వాత ప్రైవేటు కాలేజీల్లో చేరితే ఆలస్య రుసుం చెల్లించాలని తెల్పింది. ప్రభుత్వ కళాశాలల్లో చేరే వారికి మాత్రం ఆలస్య రుసుం చెల్లింపు ఉండదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ప్రవేశాలు పొందని విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని బోర్డు సూచించింది. గడువు తేదీలోగా కాలేజీలో చేరాలని స్పష్టం చేసింది. కాలేజీల జాబితా ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. ప్రవేశాల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో ఈ మేరకు గడువును పొడుగిస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు వివరించింది. కాగా పదో తరగతి పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే
కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే
ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్..
ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్..
పచ్చిమిర్చి కడిగేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
పచ్చిమిర్చి కడిగేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
ఆలయ పునరుద్ధరణకు రూ.12కోట్ల విరాళం ప్రకటించిన అనంత్ అంబానీ
ఆలయ పునరుద్ధరణకు రూ.12కోట్ల విరాళం ప్రకటించిన అనంత్ అంబానీ
రహానే నోటి దురుసు.. ఆరోన్ ఫించ్ సీరియస్ వార్నింగ్
రహానే నోటి దురుసు.. ఆరోన్ ఫించ్ సీరియస్ వార్నింగ్
కదిలే రైల్లో అద్భుతం..తోటి ప్రయాణికులే డాక్టర్లై పురుడు పోశారు!
కదిలే రైల్లో అద్భుతం..తోటి ప్రయాణికులే డాక్టర్లై పురుడు పోశారు!
సమ్మర్‌లో కరెంట్ బిల్లు వాచిపోతుందా..? ఈ సింపుట్‌ టిప్స్ పాటిస్తే
సమ్మర్‌లో కరెంట్ బిల్లు వాచిపోతుందా..? ఈ సింపుట్‌ టిప్స్ పాటిస్తే
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్