IBPS Exam Calendar 2025: ఐబీపీఎస్ జ్యాబ్ క్యాలండర్ వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) 2025-2026 సంవత్సరానికి సంబంధించి పలు బ్యాంకు ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న రాత పరీక్షల తేదీలను ప్రకటించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇందులో ఆర్‌ఆర్‌బీలో ఆఫీసర్ స్కేల్ 1, 2, 3, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులతోపాటు పీఎస్‌బీలో ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్ మెంట్ ట్రైనీ, స్పెషలిస్ట్ ఆఫీసర్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ పోస్టుల రాత పరీక్షల తేదీలను వెల్లడించింది..

హైదరాబాద్, జనవరి 17: బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) 2025-2026 సంవత్సరానికి సంబంధించి భర్తీ చేయనున్న పలు బ్యాంకు ఉద్యోగాల నోటిఫికేషన్లు, ప్రిలిమినరీ, మెయిన్స్ రాత పరీక్షలు, ఫలితాల వెల్లడి తేదీలకు సంబంధించిన ఐబీపీఎస్ జ్యాబ్ క్యాలండర్ విడుదల చేసింది. ఇందులో ఆర్‌ఆర్‌బీలో ఆఫీసర్ స్కేల్ 1, 2, 3, ఆఫీస్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో పీఎస్‌బీలో ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్ మెంట్ ట్రైనీ, స్పెషలిస్ట్ ఆఫీసర్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ వంటి ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షల తేదీల జాబితాను క్యాలండర్‌లో ప్రకటించింది.
ఐబీపీఎస్ జ్యాబ్ క్యాలండర్‌లో ముఖ్యమైన తేదీలు ఇవే..
- ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులను ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్లు, ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 స్థాయి ఉద్యోగాల భర్తీకి ఉమ్మడిగా ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతాయి. ఆఫీసర్ స్కేల్ 1 స్థాయి పోస్టులకు ఈ ఏడాది జులై 27న, ఆగస్టు 2, 3 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతాయి. అనంతరం మెయిన్స్ పరీక్ష నవంబరు 13న జరుగుతుంది.
- ఆఫీసర్ స్కేల్ 2, 3 ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష తేదీలను మాత్రం ఐబీపీఎస్ ఇంకా విడుదల చేయలేదు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించే వారికి నవంబరు 13న మెయిన్స్ పరీక్ష ఉంటుంది.
- ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఆగస్టు 30, సెప్టెంబరు 6,7 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి నవంబరు 9న మెయిన్స్ పరీక్ష జరుగుతుంది.
- ప్రొబేషనరీ ఆఫీసర్లు, మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులకు అక్టోబరు 4, 5, 11 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతాయి. మెయిన్స్ పరీక్ష నవంబరు 29న జరుగుతుంది.
- స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నవంబరు 22, 23 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతాయి. 2026, జనవరి 4వ తేదీన మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి.
- కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి డిసెంబరు 6, 7, 13, 14 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతాయి. మెయిన్స్ పరీక్ష 2026, ఫిబ్రవరి 1వ తేదీన జరుగుతుంది.
ఐబీపీఎస్ జ్యాబ్ క్యాలండర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.








