AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prakasam District: ప్రకాశం జిల్లాలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ఆరుగురు గల్లంతు

ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలో ఘోర విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ఆరుగురు యువతీ యువకులు అలల తాకిడికి గల్లంతయ్యారు. సింగరాయకొండ పాకల బీచ్‌లో గురువారం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వీరిలో ఒకరిని జాలర్లు కాపడగా ముగ్గురి మృత దేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. పండగ పూట ఆకతాయి తనం వల్ల కన్నవారికి తీరని కడుపు శోకం మిగిల్చారు..

Prakasam District: ప్రకాశం జిల్లాలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ఆరుగురు గల్లంతు
Six Goes Missing At Sea On Beach
Srilakshmi C
|

Updated on: Jan 16, 2025 | 5:14 PM

Share

సింగరాయకొండ, జనవరి 16: పండగపూట ఘోర విషాదం చోటు చేసుకుంది. కుర్రకారు కొందరు సరదాగా సముద్ర స్నానానికి వెళ్లి అలల తాకిడికి ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. ఆరుగురు యువతీ యువకులు సముద్రంలో కొట్టుకుపోయారు. గల్లంతైన వారిలో ఒకరిని జాలర్లు కాపాడగా.. మరో ముగ్గురి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. మిగతా ఇద్దరి ఆచూకీ తెలియరాలేదు. ఈ షాకింగ్‌ ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండలో గురువారం (జనవరి 16) చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

సింగరాయకొండ మండలం పాకల బీచ్‌కు నిత్యం సందర్శకుల తాకిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలో సంక్రాంతి సందర్భంగా పలువురు సందర్శకులు సముద్ర స్నానాలకు వస్తున్నారు. అయితే సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన కొందరు విద్యార్ధులు గురువారం సముద్ర స్నానానికి వెళ్లారు. వారంతా కాసేపు సముద్రంలో ఆడుకుంటూ ఉండగా.. ఇంతలో వారంతా సముద్రంలో గల్లంతయ్యారు. మొత్తం ఆరుగురు అమ్మాయిలు, అబ్బాయిలు సముద్రంలో కొట్టుకుపోయినట్లు సమాచారం. వెంటనే సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు.. స్థానిక మత్స్యకారుల సాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు, యువకుడి మృతదేహాలు లభ్యం కావడంతో కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగతావారి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

మృతులు పొన్నలూరు మండలం శివన్నపాలెంకు చెందిన నోసిన జెస్సిక (15), నోసిన మాధవ (25), కందుకూరు మండలం కొల్లగుంట గ్రామానికి చెందిన యామిని (16)గా గుర్తించారు. గల్లంతైన మరో ముగ్గురి ఆచూకీ ఇంకా తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.