AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Body Exhumed: ఆ ఊర్లో రాత్రికి రాత్రే గుడి పూజారి స‌జీవ స‌మాధి.. వారం తర్వాత సమాధి తవ్వి చూడగా..

ఆ ఊరిలో జనం అందరూ చూస్తుండగా ఓ పూజారి సజీవ సమాధి అయ్యాడు. సమాధి కోసం తవ్విన గుంటలో పద్మాసనంలో కూర్చుని ఉండగా పూజారిపై మట్టిపోసి బతికుండగానే పూట్చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సమాధి తవ్వి లోపలి దృశ్యం చూసి షాక్ కు గురయ్యారు. వివరాల్లోకెళ్తే..

Body Exhumed: ఆ ఊర్లో రాత్రికి రాత్రే గుడి పూజారి స‌జీవ స‌మాధి.. వారం తర్వాత సమాధి తవ్వి చూడగా..
Body Exhumed
Srilakshmi C
|

Updated on: Jan 16, 2025 | 1:56 PM

Share

తిరువ‌నంత‌పురం, జనవరి 16: కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురం జిల్లాలోని నెయ్యటింక‌ర గ్రామంకి చెందిన ఆల‌య పూజారి గోప‌న్ స్వామి (69) ఇటీవ‌ల స‌జీవ స‌మాధి అయ్యారు. అయితే ఆ పూజారి మృత‌దేహాన్ని పోలీసులు గురువారం స‌మాధి నుంచి పోలీసులు వెలికితీశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య నెయ్యట్టింకర పోలీసులు సమాధిని తవ్వి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆ పూజారి సమాధి అయిన‌ట్లు ఆయన కుటుంబ‌ స‌భ్యులు చెబుతున్నారు. పూజారి స‌జీవ స‌మాధి అయిన‌ట్లు జ‌న‌వ‌రి 10వ తేదీన ఆయన ఇంటి పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పోస్టర్లు వెలిశాయి. దీంతో గ్రామ‌స్థులు ఆ స‌మాధిపై అనుమానాలు వ్యక్తం చేశారు. గోప‌న్ స్వామి కోరిక మేర‌కే ఆయనను సజీవంగా స‌మాధి చేసి, గోరీ క‌ట్టిన‌ట్లు కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. దీంతో గ్రామ‌స్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గత సోమవారం సమాధి తవ్వేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కానీ కుటుంబ సభ్యులు అడ్డుకోగా పోలీసులు సమాధి తవ్వడం ఆపేశారు. ఈ రోజు సమాధి నుంచి పూజారి మృతదేహాన్ని వెలికి తీశారు. మృత‌దేహాన్ని వెలికి తీయ‌కుండా స్టే విధించాలని కుటుంబ సభ్యులు కేరళ హైకోర్టును కోరారు. తన తండ్రి గత శుక్రవారం (జనవరి 10) రాత్రి 11.30 గంటల సమయంలో సమాధి ప్రదేశానికి నడిచి వెళ్లి సమాధిలోకి ప్రవేశించారని గోపన్ స్వామి కుమారుడు రాజసేనన్ కోర్టుకు తెలిపాడు. కనిపించకుండా పోయిన వ్యక్తుల గురించి దర్యాప్తు చేసే అధికారం పోలీసులకు ఉందని కోర్టు పేర్కొంది.

అయితే విచారణలో జోక్యం చేసుకోవడానికి కోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారం అనుమానాస్పదంగా ఉందని, అందుకే దర్యాప్తును అడ్డుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. దీంతో కేర‌ళ హైకోర్టు ఆదేశాల కుటుంబ సభ్యులు ఎంత వేడుకున్నా, వారితో చర్చలు జరిపి సమాధి తవ్వి బాడీ బయటకు తీశారు. మృతదేహాన్ని తీసినప్పుడు కూర్చున్న స్థితిలోనే బాడీ ఉందని పోలీసులు గుర్తించారు. సమాధిలో ‘విభూతి’తో పాటు పలు పూజా సామాగ్రి లభ్యమైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం తరలించామని తిరువనంతపురం సబ్ కలెక్టర్ ఆల్ఫ్రెడ్ ఓవీ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని చెప్పారు. గోపన్ స్వామి మృతదేహాన్ని ప్రజల దృష్టికి దూరంగా ఉంచాలని, పోస్టుమార్టం అనంతరం సమాధిలో పాతిపెట్టాలని కుటుంబసభ్యులకు సూచించినట్లు ఆయన మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..