AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై ఎల్‌టీసీ కింద రైళ్లలోనూ ప్రయాణం చేయొచ్చు..

ఇప్పటి వరకు ఎల్‌టీసీ కింద రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణించడానికి అనుమతి ఉంది. ఇకపై తేజస్, వందే భారత్, హమ్‌ సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణించడానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నామని.. డీవోపీటీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎల్‌టీసీ ద్వారా రైలు ప్రయాణాలు చేసేటప్పుడు జీతంతో కూడిన సెలవుతోపాటు, టికెట్లపై రీయింబర్స్‌మెంట్‌ కూడా పొందనున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై ఎల్‌టీసీ కింద రైళ్లలోనూ ప్రయాణం చేయొచ్చు..
Vande Bharat Trains
Shaik Madar Saheb
|

Updated on: Jan 16, 2025 | 2:05 PM

Share

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.. ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్‌ (ఎల్‌టీసీ) కింద తేజస్, వందే భారత్, హమ్‌ సఫర్‌ రైళ్లలో ప్రయాణించడానికి అనుమతిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. వివిధ ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నుంచి వచ్చిన అనేక సూచనలను, ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ (DoPT) ఈ నిర్ణయం తీసుకుంది.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రీమియం రైళ్లలో ప్రయాణించడానికి అనుమతి ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటి వరకు ఎల్‌టీసీ కింద రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణించడానికి అనుమతి ఉంది. ఇకపై తేజస్, వందే భారత్, హమ్‌ సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణించడానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నామని.. డీవోపీటీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ విషయాన్ని వ్యయ శాఖ ( Department of Expenditure ) తో సంప్రదించి తుది నిర్ణయం తీసుకున్నారు..

అయితే.. ఇకపై అర్హత కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎల్‌టీసీ (లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్‌) ద్వారా రైలు ప్రయాణాలు చేసేటప్పుడు జీతంతో కూడిన సెలవుతోపాటు, టికెట్లపై రీయింబర్స్‌మెంట్‌ కూడా పొందనున్నారు.

లీవ్ ట్రావెల్ కన్సెషన్ అంటే ఏమిటి?

లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్‌టిసి) పథకం అనేది ప్రభుత్వ ఉద్యోగులు నాలుగు సంవత్సరాల వ్యవధిలో భారతదేశంలోని ఏ ప్రదేశానికైనా ప్రయాణించడంలో వారికి సహాయపడే రాయితీ ప్రయాణ సౌకర్యం.. దీనిలో పలు ఎంపికలు ఉంటాయి..

పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ & పెన్షన్స్ మంత్రిత్వ శాఖ, పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం ప్రకారం.. ఉద్యోగులు రెండు సంవత్సరాల కాలానికి రెండుసార్లు స్వస్థల (హోమ్ టౌన్) LTCని పొందే అవకాశం లేదా రెండు సంవత్సరాల కాలానికి ఒకసారి స్వస్థలాన్ని సందర్శించే అవకాశం.. మరో రెండు సంవత్సరాల కాలానికి భారతదేశంలోని ఏ ప్రదేశానికైనా వెళ్లే అవకాశం ఉంటుంది..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి