IBPS: డిసెంబర్ 12 నుంచి IBPS క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష.. ఎగ్జామ్ నమూనా, తదితర వివరాలు..
IBPS Clerk Exam 2021: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2021 కోసం ఈ నెలలో పరీక్షను నిర్వహిస్తుంది. ఈ పరీక్షకు
IBPS Clerk Exam 2021: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2021 కోసం ఈ నెలలో పరీక్షను నిర్వహిస్తుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు ఇప్పటికే జారీ అయ్యాయి. ఈ పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్ ibps.inని సందర్శించడం ద్వారా అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. IBPS 7858 క్లర్క్ పోస్టులను రిక్రూట్ చేయడానికి డిసెంబర్12 నుంచి19 వరకు పరీక్షలు నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత బ్యాంకులో ఉద్యోగం సంపాదించాలని కలలు కంటారు. అయితే సరైన పరీక్షా విధానం, సిలబస్ గురించి పూర్తి అవగాహన లేకపోవడం వల్ల వెనుకబడిపోతారు.
పరీక్ష నమూనా మీరు మొదటి సారి IBPS క్లర్క్ పరీక్షకు హాజరు కాబోతున్నట్లయితే మీరు తప్పనిసరిగా పరీక్ష విధానం గురించి తెలుసుకోవాలి. IBPS క్లర్క్ 2021 అనేది రెండు-దశల పరీక్షా ప్రక్రియ. దీనిలో ప్రిలిమ్స్ పరీక్ష తర్వాత మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ పరీక్షకు 2 గంటల సమయం కేటాయిస్తారు. పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. ఇది మొత్తం100 మార్కులకు నిర్వహిస్తారు. అభ్యర్థులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. IBPS క్లర్క్ 2021 పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌ను నేరుగా IBPS క్లర్క్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ లింక్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.