UPSC CISF AC 2021: CISF అసిస్టెంట్ కమాండ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. ఇలా అప్లై చేసుకోండి..
UPSC CISF AC 2021:యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో అసిస్టెంట్ కమాండెంట్ల ఉద్యోగాల భర్తీకి
UPSC CISF AC 2021:యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో అసిస్టెంట్ కమాండెంట్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ కింద 19 పోస్టులు భర్తీ చేస్తారు. దీని కోసం కమిషన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అభ్యర్థులు అప్లై చేయడానికి UPSC అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inని సందర్శించాలి. దరఖాస్తు ఫారమ్‌ను నింపిన తర్వాత CISF అధికారులకు అప్లికేషన్ ప్రింట్ అవుట్ లేదా హార్డ్ కాపీని కూడా పంపాలి. చిరునామా- డైరెక్టర్ జనరల్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, 13, CGO కాంప్లెక్స్, లోడి రోడ్, న్యూఢిల్లీ 110003. దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తు చేసినా లింక్ డియాక్టివేట్ చేస్తారు. హార్డ్ కాపీని పంపడానికి మాత్రం అభ్యర్థులకు కొన్ని అదనపు రోజులను కేటాయిస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి 1. upsc.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి హోమ్‌పేజీలో, ‘CISF AC రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2021’ లింక్‌పై క్లిక్ చేయాలి. 2. రిజిస్ట్రేషన్‌ను కొనసాగించడానికి పరీక్ష పేరుపై క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. 3. మొత్తం సమాచారాన్ని అందించి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 4. అన్ని వివరాలను అందించడం, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయడం ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను నింపడం ప్రారంభించండి. 5. అవసరమైన రుసుము చెల్లించండి, సమర్పించు బటన్‌పై క్లిక్ చేయండి. 6. UPSC CISF AC 2021 కోసం మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. 7. CISF అధికారులకు పంపడానికి ఫారమ్ కాపీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.