HCL Tech Bee: ఇంటర్ పూర్తి చేసిన వారికి సాఫ్ట్‌వేర్ జాబ్ పొందే అవకాశం.. హెచ్‌సీఎల్ టెక్‌బీ ప్రోగ్రామ్..
HCL Tech Bee: ప్రముఖ దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం హెచ్‌సీఎల్ ఇంటర్ విద్యార్థులకు బంపరాఫర్ ప్రకటించింది. ఇంటర్న్‌షిప్‌తో పాటు గ్రాడ్యుయేషన్ అందిస్తూ సంస్థలో ఉద్యోగం కల్పిస్తోంది. హెచ్‌సీఎల్ టెక్‌బీ పేరుతో ఓ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తుంది...
HCL Tech Bee: ప్రముఖ దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం హెచ్‌సీఎల్ ఇంటర్ విద్యార్థులకు బంపరాఫర్ ప్రకటించింది. ఇంటర్న్‌షిప్‌తో పాటు గ్రాడ్యుయేషన్ అందిస్తూ సంస్థలో ఉద్యోగం కల్పిస్తోంది. హెచ్‌సీఎల్ టెక్‌బీ పేరుతో ఓ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తుంది. 2021 లేదా 2022లో ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ ఇంటర్న్‌షిప్‌లో పాల్గొనడానికి అర్హతలేంటి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం…
అర్హతలు..
* హెచ్‌సీఎల్ టెక్‌బీ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలంటే 2021/ 2022 విద్యాసంవత్సరంలో కనీసం 60శాతం మార్కులతో 12వ తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2022 ఇంటర్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
* విద్యార్థులు ఇంటర్‌లో మ్యాథమెటిక్స్/ బిజినెస్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో చదివి ఉండాలి.
ఇంతటీ ఏంటీ ప్రోగ్రామ్..
* ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన విద్యార్థులకు క్లాస్‌రూమ్ ట్రెయినింగ్, ఇంటర్న్‌షిప్ ఉంటుంది. శిక్షణలో భాగంగా నెలకు రూ. 10,000 చెల్లిస్తారు.
* 12 నెలల పాటు సాగే ప్రోగ్రామ్ ముగిసన తర్వాత హెచ్‌సీఎల్‌లో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. ఐటీ, సర్వీస్ డెస్క్, బిజినెస్ ప్రాసెస్ విభాగాల్లో ఐటీ సర్వీసెస్, అసోసియేట్లు పోస్టులు ఉన్నాయి.
* ప్రోగ్రామ్‌కు ఎంపికైన విద్యార్థులకు బిట్స్‌పిలానీ, ఆమిటీ, సస్త్రా యూనివర్సిటీల నుంచి గ్రాడ్యుయేషన్ చేసే అవకాశం ఉంటుంది.
* ఉద్యోగం సాధించిన తర్వాత ఏటా రూ. 1.7 లక్షలు నుంచి రూ. 2.2 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎలా ఎంపిక చేస్తారంటే..
* విద్యార్థులను హెచ్‌సీఎల్ క్యాట్(కెరియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్) పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* ఎంపికైన వారికి నోయిడా, లఖ్‌నవూ, నాగ్‌పూర్, చెన్నై, హైదరాబాద్, మదురై, విజయవాడలో శిక్షణ ఇస్తారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..