Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GCCs Projects: ఫార్మా జీసీసీలకు కేంద్రబిందువుగా హైదరాబాద్‌.. వచ్చే ఐదేళ్లలో 25లక్షల ఉద్యోగావకాశాలు

హైదరాబాద్ మహా నగరం ప్రస్తుతం ఫార్మా జీసీసీలకు కేంద్రబిందువుగా మారనుంది. ఎలీ లిల్లీ, మెర్క్ సంస్థల జీసీసీలు త్వరలోనే నగరంలో ప్రారంభం కానున్నాయి. ఎలీ లిల్లీ, మెర్క్ సంస్థలు ప్రపంచంలోని టాప్ ఫార్మా సంస్థలు. తమ టెక్నాలజీ కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి.

GCCs Projects: ఫార్మా జీసీసీలకు కేంద్రబిందువుగా హైదరాబాద్‌.. వచ్చే ఐదేళ్లలో 25లక్షల ఉద్యోగావకాశాలు
GCCs Projects
Follow us
Prabhakar M

| Edited By: Srilakshmi C

Updated on: Jan 10, 2025 | 8:23 AM

హైదరాబాద్‌, జనవరి 9: హైదరాబాద్ ఐటీ రంగంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) విస్తరణలో ఉన్నతస్థానాన్ని దక్కించుకున్నట్లే, ఇప్పుడు ఫార్మా రంగంలోనూ అగ్రగామిగా ఎదుగుతోంది. బహుళజాతి సంస్థలు (ఎంఎన్సీలు) తమ వ్యాపార విస్తరణకు, సమర్థవంతమైన నిర్వహణకు ఈ కేంద్రాలను స్థాపిస్తున్నాయి. ఇటీవల, హైదరాబాద్ ఫార్మా జీసీసీలకు కీలక హబ్‌గా రూపుదిద్దుకుంటోంది.

ఎలీ లిల్లీ, మెర్క్ సంస్థల జీసీసీలు ప్రారంభం

700 బిలియన్ డాలర్ల విలువైన లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగంలో ప్రముఖ సంస్థ ఎలీ లిల్లీ హైదరాబాద్‌ను తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కోసం ఎంచుకుంది. మెర్క్ (ఎంఎస్), ప్రపంచంలోని టాప్-5 ఫార్మా సంస్థల్లో ఒకటి. ఇది తన టెక్నాలజీ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయనుంది.

ఎలీ లిల్లీ: మాదాపూర్‌లోని ఫీనిక్స్ ఈక్వినాక్స్ భవనంలో 2 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకొని, తమ జీసీసీ ఏర్పాటుకు సిద్ధమైంది.

ఇవి కూడా చదవండి

మెర్క్: హైదరాబాదులో టెక్నాలజీ కేంద్రం ప్రారంభించనుంది. ఈ రెండు కేంద్రాలు త్వరలో ప్రారంభం కానున్నాయి.

హైదరాబాద్‌ను ప్రత్యేకంగా ఎంచుకున్న కారణాలు:

హైదరాబాద్ ఫార్మా రంగానికి అనువైన మౌలిక సదుపాయాలు, బల్క్ డ్రగ్ పరిశ్రమలకు కేంద్రంగా ఉండటం, మరియు శక్తివంతమైన మానవ వనరులు ప్రధాన కారణాలు ఇవే

  • జీనోమ్ వ్యాలీ, శామీర్పేట వద్ద ఏర్పాటు చేసిన బయోటెక్ హబ్, పరిశోధనా కేంద్రాలుగా పనిచేస్తుంది.
  • సీసీఎంబీ, ఐఐసీటీ, నైపర్-హైదరాబాద్ వంటి అగ్రశ్రేణి సంస్థల ఉపాధి కల్పన.
  • రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పరిశ్రమలకు అనుకూల విధానాలు.
  • ఫార్మా కంపెనీలకు తక్కువ వ్యయాలతో పాటు సమర్థవంతమైన నిర్వహణ అవకాశం.

ఇతర పరిశ్రమల నుంచి ఫార్మాకీ విస్తరణ

హైదరాబాద్‌లో మొదట ఐటీ రంగంలో జీసీసీల విస్తరణ ప్రారంభమైంది. ఆ తర్వాత ఫైనాన్స్, బ్యాంకింగ్, ఫార్మా, హెల్త్‌కేర్ వంటి రంగాల్లో విదేశీ సంస్థలు తమ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1700 జీసీసీలు ఉండగా, 150కి పైగా హైదరాబాద్‌లోనే ఉన్నాయి. 2030 నాటికి దేశంలోని జీసీసీల సంఖ్య 2,550కి పెరిగి, 25 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించనున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ విస్తరణలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. హైదరాబాద్ ఐటీ, ఫార్మా రంగాల్లో తన ప్రాధాన్యతను మరింతగా నిలబెట్టుకుంటూ, గ్లోబల్ కంపెనీలకు ఆశాజనకమైన గమ్యస్థానంగా మారుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.