AP PGECET 2026: ఏపీ పీజీఈసెట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్‌డి (పీబీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) 2026 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్‌డి (పీబీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) 2026 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల చేసింది. ఈ ఏడాది విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏపీ పీజీఈసెట్ 2026 నిర్వహించనుంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 6 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇతర వివరాలు ఈ కింద తెలుసుకోవచ్చు..
ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్)-2026కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కోర్సును అనుసరించి బీఈ, బీటెక్, బీఫార్మసీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఏపీ ఈఏపీసెట్-2026 వచ్చిన ర్యాంకు ఆధారంగా బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, జియో ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫర్మాటిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలార్జికల్ ఇంజినీరింగ్, నానో టెక్నాలజీ, ఫార్మసీ విభాగాల్లో సీట్లు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఆలస్య రుసుము లేకుండా ఫిబ్రవరి 6, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 28, 29, 30 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
- నోటిఫికేషన్ జారీ: ఫిబ్రవరి 6న
- ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల సమర్పణకు అవకాశం: ఫిబ్రవరి 6 నుంచి మార్చి 6 వరకు
- రూ.1000 నుంచి రూ.10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం: మార్చి 11 నుంచి 23 వరకు
- దరఖాస్తు సవరణ తేదీలు: మార్చి 24 నుంచి మే 25
- హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం: ఏప్రిల్ 15 నుంచి
- ప్రవేశ పరీక్ష: ఏప్రిల్ 28, 29, 30 తేదీల్లో
- ప్రాథమిక కీ విడుదల తేదీ: మే 6.
- ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ: మే 8, 2026.
- ఫలితాలు విడుదల: మే 14, 2026.
ఏపీ పీజీఈసెట్ 2026 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




