UPSC New Chairman: యూపీఎస్సీ కొత్త ఛైర్‌పర్సన్‌గా ప్రీతి సుదాన్‌ నియామకం.. ఆగస్టు 1న బాధ్యతలు స్వీకరణ

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)కు కొత్త ఛైర్‌పర్సన్‌గా ప్రీతి సుదాన్‌ నియమితలయ్యారు. 1983 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి ప్రీతిసుదాన్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 316 ఎ ప్రకారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) ఛైర్‌పర్సన్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతీ సూదన్ ఆగస్టు 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆమె యూపీఎస్సీ సభ్యురాలిగా..

UPSC New Chairman: యూపీఎస్సీ కొత్త ఛైర్‌పర్సన్‌గా ప్రీతి సుదాన్‌ నియామకం.. ఆగస్టు 1న బాధ్యతలు స్వీకరణ
UPSC New Chairman
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 31, 2024 | 2:06 PM

న్యూఢిల్లీ, జులై 31: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)కు కొత్త ఛైర్‌పర్సన్‌గా ప్రీతి సుదాన్‌ నియమితలయ్యారు. 1983 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి ప్రీతిసుదాన్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 316 ఎ ప్రకారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) ఛైర్‌పర్సన్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతీ సూదన్ ఆగస్టు 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆమె యూపీఎస్సీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. వ్యక్తిగత కారణాల రిత్యా కొద్ది రోజుల క్రితం యూపీఎస్సీ ఛైర్మన్‌ మనోజ్ సోనీ రాజీనామా చేయగా.. ఆయన స్థానంలో ప్రీతి బాధ్యతలు స్వీకరించనున్నారు. యూపీఎస్సీ ఛైర్మన్‌గా ఆమె 65 ఏళ్లు వచ్చే వరకు అంటే ఏప్రిల్ 2025 వరకు ఆమె ఈ పదవీలో కొనసాగనున్నారు.

యూపీఎస్సీ ఛైర్మన్‌ సోనీ తన పదవీకాలం 2029తో ముగియనుంది. అయితే దాదాపు ఐదు సంవత్సరాల ముందుగానే ఆయన రాజీనామా చేయడం చర్చణీయాంశంగా మారింది. సోనీ 2017లో కమిషన్‌లో సభ్యుడిగా చేరారు. మే 16, 2023న యూపీఎస్సీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌ నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాన్ని దక్కించుకున్నారనే వివాదం తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం చర్చణీయాంశంగా మారింది. ట్రైనీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి పూజా ఖేద్కర్ సర్వీస్‌లో చేరేందుకు నకిలీ వైకల్య ధృవీకరణ పత్రాన్ని సమర్పించిందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదానికి, సోనీ రాజీనామాకు ఎలాంటి సంబంధం లేదని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. దాదాపు 15 రోజుల క్రితమే మనోజ్ సోని తన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూకు సమర్పించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే మనోజ్ సోని రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించకపోవడంతో ఆలస్యమైంది.

కాగా యూపీఎస్సీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 315-323 పార్ట్ 24 అధ్యాయం II ప్రకారం ఏర్పడిన ఓ రాజ్యాంగ సంస్థ. ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వం తరపున పోటీ పరీక్షలను నిర్వహిస్తుంది. ఇది ప్రతి యేట సివిల్ సర్వీసెస్ పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ద్వారా IAS, IFS, IPS, సెంట్రల్ సర్వీసెస్ – గ్రూప్ A, గ్రూప్ Bలకు నియామకం కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఈ కమిషన్‌ ఒక చైర్‌పర్సన్ నేతృత్వంలో పనిచేస్తుంది. ఇందులో గరిష్టంగా 10 మంది సభ్యులు ఉంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.