Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pet Dog: పెంపుడు కుక్కకు అతిగా భోజనం పెట్టి జైలు పాలైన మహిళ.. ఎక్కడో తెలుసా?

చాలా మంది ఇళ్లల్లో పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటారు. వాటికి పేర్లు పెట్టుకుని కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటూ మురిసిపోతుంటారు. ఇలా కొందరు కుక్కలను, పిల్లులను, ఎలుకలను, పాములను.. పెంచుకుంటూ ఉంటారు. వేళకు భోజనం పెట్టడం, స్నానం చేయించడం, బట్టలు తొడగడం వంటి సపర్యలు కూడా చేస్తుంటారు. అయితే ఓ మహిళ మాత్రం తన పెంపుడు కుక్కకు ఇవేమీ చేయకుండా..

Pet Dog: పెంపుడు కుక్కకు అతిగా భోజనం పెట్టి జైలు పాలైన మహిళ.. ఎక్కడో తెలుసా?
Pet Dog
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 30, 2024 | 9:06 PM

చాలా మంది ఇళ్లల్లో పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటారు. వాటికి పేర్లు పెట్టుకుని కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటూ మురిసిపోతుంటారు. ఇలా కొందరు కుక్కలను, పిల్లులను, ఎలుకలను, పాములను.. పెంచుకుంటూ ఉంటారు. వేళకు భోజనం పెట్టడం, స్నానం చేయించడం, బట్టలు తొడగడం వంటి సపర్యలు కూడా చేస్తుంటారు. అయితే ఓ మహిళ మాత్రం తన పెంపుడు కుక్కకు ఇవేమీ చేయకుండా.. కేవలం ఆహారం మాత్రమే వేళాపాలా లేకుండా పెట్టింది. దీంతో కుక్క విపరీతంగా బరువుపెరిగిపోయి.. నడవలేని స్థితికి చేరుకుంది. చివరకు ఒబేసిటీతో మృతి చెందిందా శునకం. ఈ విచిత్ర ఘటన న్యూజిలాండ్‌లో చోటు చేసుకుంది.

న్యూజిలాండ్ కు చెందిన ఓ మహిళ కక్కను పెంచుకుంటుంది. తన పెంపుడు కుక్కకు నగ్లీ అనే పేరుకూడా పెట్టుకుంది. ప్రతీరోజూ దానికి ఆహారం ఇవ్వడమే పని అన్నట్లు సదరు మహిళ నగ్లీకి అదుపులేకుండా ఆహారం పెట్టింది. ఇలా కొద్దిరోజులు దానికి మోతాదు స్థాయికి మించి ఆహారాన్ని ఇవ్వడంతో 53.7 కిలోల బరువు పెరిగింది. దీనిపై సమాచారం అందుకున్న సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ (SPCA) సదరు మహిళ ఇంటికి వచ్చి నగ్గీని పరిశీలించారు. ఇంట్ల భారీ ఆకారంలో ఉన్న కుక్కను చూసి తొలుత వారు షాక్‌కు గురయ్యారు. నగ్లీ ఒంట్లో విపరీతంగా కొవ్వు పేరుకుపోవడంతో, అది ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిపడసాగింది. 10 మీటర్లు నడవడానికి 3 సార్లు ఆగవల్సిన పరిస్థితి నెలకొంది. దాని భారీ దేహాన్ని కాళ్లు మోయలేక కూలబడిపోతుంది.

నగ్లీ పరిస్థితిని గమనించిన ఎస్పీసీయే అధికారులు 2021లో కుక్కను మహిళ నుంచి రక్షించి SPCA సంరక్షణలో ఉంచారు. కుక్కను పరిశీలించిన పశువైద్యులు అధిక బరువు కారణంగా తీవ్రమైన దీర్ఘకాలిక అసౌకర్యంతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. నగ్లీ ఇంత బరువు పెరగడానికి దాని యజమాని కుక్క బిస్కెట్లతో పాటు రోజుకు 10 చికెన్ ముక్కల వరకు తినిపించిందని, దానికి తగిన వ్యాయామం అందించడంలో విఫలమైనట్లు విచారణలో తేలింది. SPCA సంరక్షణలో నగ్లీ రెండు నెలల్లో దాదాపు 9 కిలోల బరువు తగ్గినప్పటికీ, కాలేయ రక్తస్రావంతో తీవ్ర అనారోగ్యం పాలై నుగ్గి చివరకు మరణించింది. పోస్టుమార్టంలో కాలేయ వ్యాధి, కుషింగ్స్ వ్యాధితో సహా అంతర్లీన ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు వెల్లడించింది. దీనిపై SPCA అధికారులు స్పందిస్తూ.. కుక్క ఆహారం, జీవనశైలిని దాని యమజాని పూర్తిగా తారుమారు చేసింది. చివనరే అది నడవలేని స్థితి వరకు అధికంగా ఆహారం ఇవ్వడం వల్లనే మరణించినట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

అనంతరం సదరు మహిళ ఇంటిపై దాడి చేసిన అధికారులు.. ఆమె ఇంట్లో ఇంకా అనేక కుక్కలు ఉన్నట్లు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటన్నింటినీ ఆక్లాండ్ జంతు సంరక్షణ ఆశ్రయానికి తరలించారు. నగ్లీ మృతి చెందడంతో సదరు మహిళపై కేసు నమోదు చేశారు. తాజాగా కుక్క శారీరక, ఆరోగ్యం, ప్రవర్తనా అవసరాలను నిర్లక్ష్యం చేసినందుకు కోర్టు సదరు మహిళకు రెండు నెలలు జైలు శిక్షతో రూ.60.313 జరిమానా విధించింది. అలాగే ఆమె 12 నెలలపాటు కుక్కలను పెంచుకోకుండా కోర్టు నిషేధం విధించింది. ఈ మేరకు మానుకోవు జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.